లతాజీ గెట్ వెల్ సూన్ : ఆస్పత్రి గోడల మధ్య గాన కోకిల!
ముంబయి దారులు కాస్త విచారాన్ని మోస్తున్నాయి..ఆస్పత్రి గోడల మధ్య ఇప్పుడిప్పుడే గడపాల్సి వస్తుందన్న వార్త ఒకటి గాయనీమణి లతా మంగేష్కర్ ను కలవరపాటుకు గురిచేస్తున్నది..ఎందరినో తన గానామృత ధారలో ఓలలాడించిన గొంతుక మరిన్ని పాటలు వినిపించాలని దేవుడ్ని వేడుకుంటూ..మళ్లీ మళ్లీ మీ గొంతు వినాలన్న భారతీయుల తాపత్రాయాన్ని, వినమ్ర పూర్వక అభ్యర్థనను అర్థం చేసుకుని లతాజీ మీరు వెంటనే కోలుకోండి.. మీకు ఏం కాదు ఈ దేశం మీ వెంటే అని చెబుతూ దైవాన్ని ప్రార్థిస్తూ.. వంద కోట్లకు పైగా భారతీయులు.
బ్రిచ్ కాండీ ఆస్పత్రికి ఓ విన్నపం..మీ దగ్గరకు వచ్చిన మా భారత రత్నను, మా గాన కోయిలను జాగ్రత్తగా చూడండి ప్లీజ్! ఆ గొంతు మాకే కాదు ఈ ప్రపంచానికే అవసరం.గతంలోనూ శ్వాస సంబంధ వ్యాధితో ఆమె బాధపడ్డారని విన్నాను. చదివేను..ఇప్పుడు కూడా ఆమెకు కరోనా ఇబ్బంది పెడుతోందని విన్నాం.. వైద్యులారా మీకు మా విన్నపం మీరు కాస్త దేవుడి సాయం కూడా తీసుకుని వేగంగా లతాజీని స్వరాల తోటలో విహరించే అవకాశం ఇవ్వండి..ఇదొక్కటే మా విన్నపం.
ముంబయి దారుల్లో గాన కోయిల స్వరం గురించి వినడంలో ఆనందం ఉంది. ఆమె గురించి వింటూ ఆమె పాట వింటూ పరవశించిన భారత రత్నాలలో ఎందరెందరో ఉన్నారు.పేరుకు ఆమె భారత రత్న..ఆమె పాట విని పులకరించిన రత్నాల్లాంటి మనుషులెందరో!ఆమె పాటకు ఉత్తర, దక్షిణ అన్న భేదం లేదు..అన్నింటా రాణించే ఆ స్వర రాగ ప్రస్థారంలో కొన్ని అపజయాలున్నాఅవన్నీ దాటుకుని ఇటుగా వచ్చారు. ఎందరెందరికో స్ఫూర్తి అయ్యారు.అయితే ఆమెకు గతంలో మాదిరిగానే ఇప్పుడూ శరీర రుగ్మతలు చుట్టుముట్టాయి. స్వల్పలక్షణాలతోనే ఆమె ఆస్పత్రిలో చేరారని వైద్య వర్గాలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో లతాజీ ఆస్పత్రి నుంచి తొందరగా డిశ్చార్జి కావాలనే ఆశిద్దాం.