
వెస్ట్‌లో ఆ నాలుగు సీట్లలో నో క్లారిటీ..?
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నుంచి కొందరు టీడీపీ నేతలు మళ్ళీ పార్టీని గాడిలో పెట్టే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పార్టీ బాగానే పికప్ అయింది కూడా. కాకపోతే కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా పార్టీ పికప్ కాలేకపోతుంది. దీనికి పలు కారణాలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల టీడీపీకి సరైన నాయకత్వం లేక ఇబ్బందుల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. లేదంటే జిల్లాలో టీడీపీకి కొత్త ఊపు వచ్చేది.
అయితే ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టీడీపీ ఇంచార్జ్‌లని మార్చారు. నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం లాంటి నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లని మార్చారు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా క్లారిటీ లేకుండా పోయింది. ముఖ్యంగా నాలుగు నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌ల విషయంలో క్లారిటీ లేదు. చింతలపూడి, నిడదవోలు, కొవ్వూరు లాంటి నియోజకవర్గాల్లో టీడీపీకి ఇంకా ఇంచార్జ్‌లని పెట్టలేదు. మామూలుగానే ఈ నియోజకవర్గాలు టీడీపీకి అనుకూలమైన నియోజకవర్గాలే..కానీ ఇంతవరకు ఈ నాలుగు చోట్ల టీడీపీకి సరైన నాయకుడు లేరు.
నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు...మళ్ళీ పోటీ చేయనని అంటున్నారు. ఇక ఈయన స్థానంలో కొత్త నేతని పెట్టాలి. అటు చింతలపూడి, కొవ్వూరులో ఎస్సీ స్థానాలు...కానీ ఇక్కడ కమ్మ నేతల డామినేషన్ ఎక్కువ ఉంది..దీంతో ఇంచార్జ్‌ల ఎంపిక విషయంలో ఆలస్యం జరుగుతుంది. అటు భీమవరంలో టీడీపీకి ప్రస్తుతం ఇన్‌చార్జ్ ఉన్నా ఆయనే ఫైనల్ అవుతారన్న గ్యారెంటీ లేదు. ఈ నాలుగు చోట్ల ఇన్‌చార్జ్‌లను పెడితేనే ఇక్కడ పార్టీ స్పీడప్ అవుతుందని అంటున్నారు.