ఇదేందయ్యా ఇది.. చైనా చేసిన పని తెలిస్తే షాకే?
అయితే కేవలం పాకిస్తాన్ లాంటి దేశాలనే కాదు ఆఫ్రికన్ దేశాలలో కూడా తమ ఆధిపత్యం సాధించడం కోసం చైనా ఆర్థిక సహాయం అనే ఎర వేసింది. ఆర్థిక సహాయం పేరుతో ఎన్నో ఆఫ్రికా దేశాలకు అప్పులు ఇచ్చింది. ఇక భారీ వడ్డీతో అప్పు ఇస్తూ చివరికి ఎన్నో ఆఫ్రికన్ దేశాలను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది అన్న విషయం బయటపడింది. ఇటీవల చైనా విదేశాంగ శాఖ మంత్రి అటు ఆఫ్రికన్ దేశాల కు పర్యటనకు సంబంధించిన వ్యవహారమే ఎక్కువగా అంతర్జాతీయ మీడియాలో విషయం ఇటీవల బయటపడింది. ఈ క్రమంలోనే చైనా విదేశాంగ శాఖ మంత్రి ఆఫ్రికా పర్యటన మాత్రం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఈ క్రమంలోనే అప్పులు వసూలు లేదా రీషెడ్యూల్ చేయడానికి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అటు సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ రావడం కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తాము ఆఫ్రికన్ కంట్రీస్ ని అప్పుల ఊబిలోకి తోయటం లేదు అంటూ చైనా కల్లబొల్లి మాటలు చెబుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల కొంత మంది నెటిజన్లు లెక్కలతో సహా చైనా చేస్తున్న అక్రమాలను సోషల్ మీడియా వేదికగా బయట పెట్టడం గమనార్హం. మొత్తంగా ఆఫ్రికా దేశాలకు 148 బిలియన్ డాలర్ల అప్పులు చైనా ఇచ్చినట్లు తెలుస్తోంది. 2010 నుంచి ఇప్పటివరకు ఏకంగా 32 ఆఫ్రికా దేశాలకు చైనా అప్పు ఇచ్చినట్లు తెలిసింది. ఇది కాస్త ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.