ట్రోల్ వర్డ్ : పీఆర్సీ
ఉద్యోగ సంఘాలు ఓడి, జగన్ సర్ గెలిచారనుకోవాలి.
ఆంధ్రావని లో ఉద్యోగికి కొత్త పీఆర్సీ ప్రకటించినా కూడా సంతృప్తి లేదు. జగన్ ప్రకటించిన విధంగా చూస్తే తమకు నష్టమే కానీ లాభం లేదని ఐఆర్ 27 శాతం ఇచ్చి, ఫిట్మెంట్ ను 23 శాతంకు పరిమితం చేయడంలో అర్థమే లేదని అంటున్నాయి కొన్ని ఉద్యోగ వర్గాలు. దీనిని తాము వ్యతిరేకిస్తున్నామని కూడా చెబుతున్నాయి.దీంతో మరో మారు ఉద్యోగ సంఘాలు రెండు వర్గాలుగా చీలిపోయి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా ఓ వర్గం,వేతన ప్రయోజనాలే పరమావధిగా మరో వర్గం ఉండనుంది.
కొత్త పీఆర్సీకి సంబంధించి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉద్యోగులకు నూతన సంవత్సర కానుకని అందించారని వైసీపీ చెబుతోంది. అయితే ఫిట్మెంట్ 23 శాతం ఇవ్వాలని నిర్ణయిస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై విభిన్న వాదనలు వస్తున్నాయి. కొత్త పీఆర్సీ నిర్ణయం ఏమీ బాగాలేదని కూడా ఉద్యోగులు కొందరు పెదవి విరుస్తున్నారు. తాము అనుకున్న విధంగా కాకుండా జగన్ నిర్ణయించిన విధంగా పీఆర్సీ ఉందని అంటున్నారు. మరోవైపుజీతాలు తగ్గిపోతున్నాయని తాజా పీఆర్సీ కారణంగా తమకు నష్టమేనని ఇంకొందరు అంటున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా తమ ఖజానాకు పదివేల కోట్ల రూపాయల భారం అని అంటున్నారు జగన్.ఎవరి తీరు ఎలా ఉన్నా ఎవరి మాట ఎలా ఉన్నా ఈ వారం ట్రోల్ వర్డ్ పీఆర్సీ నిలిచింది. అయితే తాము సమ్మతిగా లేమని అంటున్నాయి ఉద్యోగ సంఘాలకు చెందిన కొన్ని వర్గాలు..దీంతో జగన్ మచ్చిక చేసుకున్నాకూడా ఫలితం ఉండదని కొత్త పీఆర్సీలో చెప్పిన ఫిట్మెంట్ కు తాము అనుకూలంగా లేమనే చెబుతున్నాయి ఉద్యోగ సంఘాలకు చెందిన కొన్ని ప్రతినిధి స్వరాలు.