న‌ర‌సారావుపేట‌కు మాచ‌ర్ల ఫార్ములా... చ‌ద‌ల‌వాడ అవుట్‌..!

M N Amaleswara rao
గుంటూరు జిల్లాలో నరసరావుపేట -మాచర్ల రెండు నియోజకవర్గాలు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటివి. ఈ రెండు నియోజకవర్గాల్లో చివరిసారిగా 1999లో మాత్రమే తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది. 2024 ఎన్నికలకు ముందు చూస్తే రెండు దశాబ్దాలపాటు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ప‌ట్టు లేదనే అర్థ‌మ‌వుతోంది. మాచర్లలో ఒక ఉప ఎన్నికతో కలుపుకొని వరుసగా ఐదు సార్లు... నరసరావుపేటలో వరుసగా నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. తాజాగా మాచర్లలో పార్టీ సీనియర్ నేత జూలకంటి బ్రహ్మారెడ్డికి చంద్రబాబు పార్టీ పగ్గాలు అప్పగించారు. బ్రహ్మారెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించిన వెంటనే గత పదేళ్ళలో అక్కడ తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు లేనంత జోష్‌ వచ్చింది.
వచ్చే ఎన్నికల్లో మాచర్ల గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంద‌న్న‌ అంచనాలు అప్పుడే వచ్చేశాయి. మరోవైపు బ్రహ్మారెడ్డి కి ఇంచార్జ్ ఇవ్వడంతో వైసీపీ వర్గాల్లో కూడా గుబులు రేగుతోంది. ఇక ఇప్పుడు ఇదే ఫార్ములా నరసరావుపేటలోనూ అమలు చేసేందుకు చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో బీసీ వర్గానికి చెందిన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పోటీ చేశారు. బాబు ఇక్క‌డ బీసీ ప్ర‌యోగం చేసినా విక‌టించింది. పార్టీ చ‌రిత్ర‌లోనే ఎప్పుడూ లేనంత ఘోరంగా 33 వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది.
పేట అంటేనే క‌మ్మ వ‌ర్సెస్ రెడ్డి పోరు :
ప‌ల్నాడు ముఖ‌ద్వారం అయిన న‌ర‌సారావుపేట రాజ‌కీయాలు అంటేనే 1955 నుంచి 2019 వ‌ర‌కు క‌మ్మ వ‌ర్సెస్ రెడ్డి అన్న‌ట్టుగానే పోరాటం ఉండేది. గ‌తంలో కాంగ్రెస్‌, ఆ త‌ర్వాత వైసీపీ, టీడీపీ నుంచి ఈ రెండు వ‌ర్గాల‌కు చెందిన వారే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వ‌చ్చారు. తెలుగుదేశం పార్టీ పుట్టాక 1983 నుంచి 1999 వ‌ర‌కు వ‌రుస‌గా ఐదుసార్లు దివంగ‌త కోడెల శివ‌ప్ర‌సాద‌రావు గెలిచారు. కోడెల క‌మ్మ నేత‌. ఆ త‌ర్వాత కాంగ్రెస్ నుంచి రెండు సార్లు వ‌రుస‌గా కాసు వెంక‌ట కృష్ణారెడ్డి, ఆ త‌ర్వాత రెండు వైసీపీ నుంచి reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి గెలుస్తూ వ‌స్తున్నారు.


చ‌ద‌ల‌వాడ‌కు అదే మైన‌స్ అయ్యిందా...
గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన చ‌ద‌ల‌వాడ అర‌వింద‌బాబు ఎంత జ‌గ‌న్ వేవ్ ఉన్నా కూడా పార్టీ చ‌రిత్ర‌లోనే ఎప్పుడూ లేనంత ఘోరంగా 33 వేల ఓట్ల‌తో ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆయనే ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. అయితే దూకుడుగా లేక‌పోవ‌డం.. నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉన్న వైసీపీని ఢీ కొట్టే స‌త్తాలేక‌పోవ‌డంతో ఆయ‌న‌పై కేడ‌ర్‌లో భ‌రోసా లేదు. పేట‌లో కాంగ్రెస్‌ను ఢీకొట్టి వ‌రుస‌గా ఐదుసార్లు గెలిచారు అంటే కోడెల ఏ విష‌యంలో అయినా ఢీ అంటే ఢీ అన్న‌ట్టుగా ఉండేవారు. ఇప్పుడు అర‌వింద‌బాబు స్థానిక ఎమ్మెల్యేపై ఎన్ని ఆరోప‌ణ‌లు వ‌చ్చినా కిమ్మ‌న‌డం లేదు. పైగా నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ కేడ‌ర్‌ను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా వాటిని ఖండించ‌ట్లేదు. పార్టీ త‌ర‌పున గ‌ట్టిగా పోరాటం చేసే కేడ‌ర్‌, నాయ‌కుల‌ను తాను ఉన్నాన‌న్న ధైర్యం క‌ల్పించ‌లేక‌పోతున్నారు.


మ‌రోవైపు న‌ర‌సారావుపేట రాజ‌కీయం ఎప్పుడూ నువ్వా  ?  నేనా ? అన్న‌ట్టుగా ఉంటుంది. ఆ స్థాయిలో ఇక్క‌డ రాజ‌కీయం చేస్తేనే పార్టీ జెండా ఎగురుతుంది. అర‌వింద‌బాబు పూర్తి మొత‌క‌వైఖ‌రితో పాటు ఏదేమైనా నేను మాత్రం ఎమ్మెల్యేను, వైసీపీని విమ‌ర్శించ‌నంటూ బుగ్గ‌న బెల్లం పెట్టుకున్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చివ‌ర‌కు బీసీల్లో కూడా ఆయ‌న‌కు ప‌ట్టులేదు అనేందుకు గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయిన తీరే నిద‌ర్శ‌నం.
చ‌ద‌ల‌వాడ‌ను న‌మ్ముకుంటే క‌ష్ట‌మ‌ని తేలిపోయిందా..!
చ‌ద‌ల‌వాడ అర‌వింద‌బాబునే న‌మ్ముకుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ గెల‌వ‌డం సందేహ‌మే అన్న నిర్ణ‌యానికి పార్టీ అధిష్టానం వ‌చ్చేసిన‌ట్టు తెలిసింది. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో ఢీ కొట్టే నేత‌లకే పార్టీ ప‌గ్గాలు ఇవ్వాల‌ని పార్టీ అధిష్టానం ఆలోచ‌న చేస్తోంది. ఇక సామాజిక వ‌ర్గాల ప‌రంగా కూడా గ‌త ఈక్వేష‌న్లు బ్యాలెన్స్ చేస్తూ ఇక్క‌డ టీడీపీ కొత్త నేత ఎంపిక జ‌ర‌గ‌నుంద‌ని పార్టీలో చ‌ర్చ న‌డుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: