పండక్కి ఊరెళ్తున్నారా.. ఇలా చేసి నష్టపోవద్దు?
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ లోని వివిధ ప్రాంతాలకు మరీ ముఖ్యం గా భాగ్యనగరానికి ఎంతో మంది ఉద్యోగం వ్యాపారం చదువుల నిమిత్తం వచ్చి ఇక్కడే ఉంటున్న వారు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం సంక్రాంతి పండక్కి సొంతూరుకు వెళ్ళికుటుంబ సభ్యులతో సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ సొంతూళ్లకు బయలు దేరుతున్నారు. అయితే పండక్కి సొంత వూరు వెళ్ళడం మంచిదే. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం భారీగా నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో దొంగలు హల్ చల్ చేస్తున్నారు.
ఇంటికి తాళం కనబడింది అంటే చాలుఇక దొంగతనానికి పాల్పడి ఇల్లు గుల్ల చేస్తున్నారు. తిరిగి వచ్చిన యజమానులకు షాక్ ఇస్తున్నారు. ఈ క్రమం లోనే పండక్కి సొంతూళ్లకు వెళ్తున్న వారు ఇంటికి భద్రం గా తాళం వేయడమే కాదు.. ఇక పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వాలని.. పక్కింటి వాళ్ళకి కూడా ఓ కన్నేసి ఉంచాలి అని చెప్పి వెళ్లాలి అని సూచిస్తున్నారు పోలీసులు. ఇలా చెప్పకుండా.. తాళం వేశామ్ కదా అని భరోసాతో వెళ్లి పోయారు అంటే ఇక భారీ నష్టం తప్పదు అంటూ పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు.