అఖండ-2 ను స్పెషల్ షో వేయించుకుని చూసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. సినిమా ఎలా ఉంది అంటే..?

Thota Jaya Madhuri
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్వసంఘచాలకుడు మోహన్ భగవత్ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అఖండ–2’ చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శనలో వీక్షించారు. ఈ ప్రత్యేక స్క్రీనింగ్ కోసం ఢిల్లీలోని ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. మూవీ విడుదలకు ముందే దేశ రాజధానిలోని ఆ సంస్థ ప్రధాన సభ్యుల కోసం ఈ ప్రత్యేక షోని నిర్వహించినట్లు నిర్మాత వర్గాలు వెల్లడించాయి.ఈ కార్యక్రమానికి సినిమాలో నటీనటులు మరియు సాంకేతిక బృందం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యంగా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాతలు, కొంత మంది చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాన్ని సందర్శించి, భాగవత్‌తో కలిసి సినిమా ప్రదర్శనను ఆస్వాదించారు.



సినిమా ప్రదర్శన అనంతరం మోహన్ భగవత్ మీడియాతో మాట్లాడిన సందర్భంలో..‘అఖండ–2’ సినిమా గురించి ప్రశంసలు కురిపించారు. సినిమా మొత్తం చాలా శక్తివంతంగా, భావోద్వేగపూరితంగా రూపొందించబడిందని ఆయన అభిప్రాయపడ్డారు. కథానాయకుడు నందమూరి బాలకృష్ణ పోషించిన శక్తివంతమైన పాత్రకు ప్రత్యేకంగా మోహన్ భగవత్ మెచ్చుకున్నారు. అలాగే సినిమాకు దర్శకత్వం వహించిన బోయపాటి శ్రీను చేసిన విజువల్ ప్రెజెంటేషన్, పౌరాణిక భావాలు, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆయన అభినందించారు.



ఇక సినిమా విడుదల విషయానికి వస్తే— తొలుత సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల చేయాలని యూనిట్ భావించింది. అయితే అనివార్య కారణాల వల్ల ఆ తేదీ మార్చబడింది. తర్వాత విడుదల తేదీని డిసెంబర్ 5కి మార్చినా, విడుదలకు ముందు కొన్ని సాంకేతిక మరియు పరిపాలనా సమస్యలు తలెత్తడంతో మరోసారి వాయిదా వేయక తప్పలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది.  చిత్ర విడుదలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే దేశవ్యాప్తంగా పలుచోట్ల థియేటర్ల వద్ద భారీగా కటౌట్స్‌, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ సినిమా విడుదల మరోసారి వాయిదా పడటంతో థియేటర్ల వద్ద ఏర్పాటు చేసిన ఆ ప్రచార సామగ్రిని తీసివేయకూడదని యూనిట్ సభ్యులు థియేటర్ యాజమాన్యాలకు సూచించినట్లు సమాచారం. ఏదైనా అనుకోని పరిస్థితి తలెత్తితే ప్రచార కార్యక్రమాలు నిరవధికంగా కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.



‘అఖండ–2’ ప్రదర్శనపై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రాల్లాగే ఈ చిత్రం కూడా భారీ స్థాయి అంచనాలను రేకెత్తిస్తుండడంతో, ఈ ప్రత్యేక షో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: