ఇన్నాళ్లకి బుర్ర పెట్టి ఆలోచించిన జాన్వీ కపూర్..అద్దిరిపోయే జాక్ పాట్ ఆఫర్ పట్టేసిందిరోయ్..!

Thota Jaya Madhuri
బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. తన తల్లి శ్రీదేవి గ్లామర్‌ను, నటనా మెరుపులను వారసత్వంగా అందుకున్న జాన్వీ, బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తక్షణమే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అందం, అభినయం, స్టైల్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, గ్లామర్ పాత్రల నుండి ప్రయోగాత్మక పాత్రల వరకు విభిన్న పాత్రల్లో నటిస్తూ యూత్ హార్ట్‌లను కట్టిపడేస్తోంది.



‘పరమ్ సుందరి’ వంటి సినిమాల్లో తన గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న జాన్వీ, ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ కెరీర్‌లో వేగంగా దూసుకుపోతోంది. ఈ అమ్మడిలో ఉన్న గ్లామర్, ట్రెండ్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు అభిమానులు మంచి క్రేజ్‌ను చూపిస్తున్నారు.ఇక తాజాగా, ఈ బ్యూటీ మరో ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీలో నటించబోతుందన్న వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. బాలీవుడ్ యంగ్ హీరో లక్ష్య ప్రధాన పాత్రలో, దర్శకుడు రాజ్ మెహతా రూపొందిస్తున్న ‘లగ్ జా గాలే’ సినిమాలో జాన్వీ కథానాయికగా నటించబోతుందన్న వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రేమ, ప్రతీకారం వంటి ప్యాషన్ ఎలిమెంట్స్‌తో యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడన్న అఫవాహలు కూడా వినిపిస్తున్నాయి.



ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే శరవేగంగా ప్రారంభమైనట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇన్నాళ్లు జాన్వీకి తన అందానికి తగ్గ స్థాయి పెద్ద ఆఫర్లు రాలేదనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తన ఛాయిస్‌ను, పాత్రలను, కెరీర్‌ ప్లానింగ్‌ను ఎంతో సీరియస్‌గా ఆలోచిస్తూ ముందుకు సాగుతున్న జాన్వీని చూసి, “ఇప్పుడే అసలైన జాన్వీ అవతారం మొదలైంది” అంటూ అభిమానులు, సినీ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలీవుడ్‌లో  జాన్వీ కపూర్ ఒక ఆశాజనక నటి అని అందరూ ఒప్పుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని వైవిధ్యమైన పాత్రలు, భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించబోతుందో చూడాలి..!??

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: