బాబు సొంత ఇలాకాలో ఫ్యాన్ స్పీడ్‌కు బ్రేకుల్లేవ్...!
సరే కడప కాబట్టి జగన్ సొంత జిల్లా అందుకే వైసీపీ హవా ఉందని అనుకోవచ్చు..చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కూడా వైసీపీ డామినేషన్ నడుస్తోంది. గత రెండు ఎన్నికల్లో అదే పరిస్తితి. ఏదో కడప మాదిరిగా చిత్తూరు కూడా వైసీపీకి కంచుకోటగా మారిపోయింది. అసలు చిత్తూరులో కూడా టీడీపీకి ఏ మాత్రం అవకాశం దొరకడం లేదు. అయితే రానున్న రోజుల్లో కూడా చిత్తూరులో టీడీపీకి అవకాశం దొరికేలా కనిపించడం లేదు. ఎందుకంటే చిత్తూరులో వైసీపీకి ఉన్నట్లు టీడీపీలో బలమైన నాయకులు లేరు.
పైగా చిత్తూరులో రెడ్డి సామాజికవర్గం హవా ఎక్కువ. పైగా ఎస్సీలు కూడా వైసీపీ వైపే ఉంటారు. దీంతో జిల్లాలో వైసీపీకే లీడింగ్ ఉంటుంది. అసలు ఎన్నికలై రెండున్నర ఏళ్ళు అయినా సరే చిత్తూరులో పెద్దగా వైసీపీ బలం తగ్గలేదు. ఇక్కడ ఇప్పటికీ వైసీపీ హవా నడుస్తూనే ఉంది. ఏదో రెండు, మూడు నియోజకవర్గాల్లో టీడీపీకి అనుకూలంగా పరిస్తితులు ఉన్నాయి తప్ప...మిగిలిన చోట్ల వైసీపీ డామినేషన్ కనిపిస్తోంది. ముఖ్యంగా రెడ్డి వర్గం ఎమ్మెల్యేల ఉన్న చోట్ల టీడీపీకి ఏ మాత్రం ఛాన్స్ దొరకడం లేదు. ఇక ఇదే పరిస్తితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కూడా చిత్తూరులో ఫ్యాన్ లీడ్ తగ్గదు.