ట్రోల్ వర్డ్ : ఫ్లై ఓవరు !?
స్థాయిలో ఓ సమస్య వచ్చిపడింది మోడీకి
ఆయన ఎంతగా ప్రయత్నించినా కూడా
ఎంచుకున్న మార్గంలో ఎంచుకున్న విధంగా
ప్రయాణించలేక తీవ్ర అవమానం అనే భారంతో
వెనుక్కు వెళ్లిపోయిన వైనమే ఇప్పుడు ట్రోలింగ్ పాయింట్ .....
ఆందోళనకారుల కారణంగా ప్రధాని ఇవాళ తీవ్రం అయిన అసహనం పొంది ఉన్నారని ప్రధాన మీడియా చెబుతోంది.ఓ దేశ ప్రధాని తొలిసారి తన పర్యటనను రద్దు చేసుకుని వెళ్లిపోవడంలో భద్రతా సంబంధ వైఫల్యాలే ఎక్కువగా ఉన్నాయని కూడా అంటోంది. ఇవన్నీ ఎలా ఉన్నా కూడా మోడీ అనుకున్న విధంగా సభకు రాలేని కారణంగా ఫ్లైఓవ రు వార్త తెగ వైరల్ అయింది.. దీంతో ఒక్కసారి ఆ ప్రాంతం ఆ ఊరు అన్నీ కూడా ఎక్కడెక్కడ అని వెతికే పనిలో పడ్డారు నెటిజనులు.
ఈ తరుణంలో ఈ నేపథ్యంలో....
ప్రధాని మోడీకి తీవ్ర భంగపాటు కలిగింది అని బీజేపీ కోపం అవుతుంది.కానీ ఇదేం తాము చేసింది కాదని అదంతా తనకు తాను చేసుకున్నదే అని అంటోంది కాంగ్రెస్.మొ త్తమ్మీద ఇవాళ పంజాబ్ లో మోడీ చేయాలనుకున్న పర్యటన ఏదీ అనుకున్నవిధంగా జరగకుండా పోవడంతో నిరాశలో ఉన్న బీజేపీ నాయకులు నోటికి వచ్చిందంతా వాగు తున్నారని కాంగ్రెస్ దుయ్యబడుతోంది.సో.. దేశ ప్రధాని మాటలు వినే యోగ్యత మరోసారి పంజాబ్ కు ఉంటుందిలే కానీ ఇవాళ ఫ్లై ఓవరు అన్న మాట మాత్రం భలే ట్రోల్ అ వుతోంది.
ఇవాళ మోడీ చేయాలనుకున్నవేవీ చేయలేకపోయారు..కొన్ని శంకుస్థాపనలు తరువాత ఇంకా కొన్ని మంచి పనులు వీటితో పాటు ఓ బహిరంగ సభ ఇంకా కొన్ని డైనమైట్ లాంటి మాటలు..లైమ్ లైట్ లోకి తీసుకుని రావాలనుకున్నా కూడా కుదరలేదు.పాపం ఆయన టైం అంతా ఖర్చయిపోయింది.పంజాబ్ లో ఆందోళనకారుల తీరు కారణంగా ఆయన చేయాలనుకున్నవేవీ చేయలేదు. ఆ విధంగా ఆయనను ట్రాఫిక్ లో ఇరుక్కునేలా చేసిన పంజాబ్ కాంగ్రెస్ సర్కారు పై బీజేపీ పెద్ద మనుషులు అంతా గుర్రుగా ఉన్నారు.ఆఖరికి గుర్రం మీద వెళ్లినా బాగుండునేమో ఎందుకనో ఖరీదయిన కార్లు ఎంచుకుని ఇబ్బంది పడ్డారు అంటూ కొన్ని పెదవి విరుపులూ వస్తున్నాయి.ఏదేమయినా మోడీ స్పీచ్ వినే భాగ్యం పంజాబ్ కు లేదు. ఆ విధంగా పంజాబ్ ప్రాయిశ్చిత్తం చేసుకోవాల్సిందే!