ఓవర్ టూ షర్మిల : టెలిఫోన్ నవ్వులు ఓట్లేస్తాయా ?!

ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ పడితే ఎంటి ? ఎవరు ఎక్కడయినా పార్టీ పెట్టోచ్చు అంటూ రాజకీయంగా హీట్ ను క్రియేట్ చేసిన వై.ఎస్ .షర్మిల ఆంధ్ర ప్రదేశ్ లోని సీనియర్ కాంగ్రెస్ నేతలతో ఫోన్ లో సంభాషిస్తున్నట్లు ఆమె సన్నిహితులు పేర్కోంటున్నారు. ఇది దేనికి సంకేతం ?
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం దీనావస్థలో ఉంది. గతంలో కాంగ్రెస్ లో ఒకవెలుగు వెలిగి, ప్రస్తుతం  రాజకీయలాకు దూరంగా ఉన్న సీనియర్ నేతలందరూ వేరే పార్టీలోకి పోలేక, పొయిన వారు అక్కడ ఇమడ లేక మిన్నకుండి పోయారు. ఎక్కడా రాజకీయ  కార్యకలాపాలు చేయడం లేదు. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ లో చాలా మంది సీనియర నాయుకులు, వారి కుటుంబ సభ్యులు దవంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగారు.  వారిలో చాలా మంది ప్రస్తుతం రాజకీయలను పక్కన పెట్టేసి ఉన్నారు. కొందరు రాజకీయంగా యాక్టివ్ గా లేకపొయినా,  ప్రసార మాధ్యమాల్లో కనిపిస్తున్నారు. గతంలో ఎం.పిలుగా, ఎం.ఎల్.ఏలుగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా చేసిన వారు  అటు కాంగ్రేస్ లో ఉండలేక, ఇటు టిడిపిలోకి రాలేక,  ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న వై.ఎస్ జగన్ కోటరీతో ఇమడ లేకున్నారు. అలాంటి వారిపైనే రాజశేఖర్ రెడ్డి  గారాల పట్టి వై.ఎస్. షర్మిల దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 2021లో హైదరాబాద్ లో నిర్వహించిన వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పుష్కర వర్థంతికి ఆంధ్ర ప్రదేశ్ నుంచి  చాలా మంది నేతలను ఆహ్వానించారు. అయితే కారణాలు ఏవైనా కొద్ది మంది మాత్రమో ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ అంశం పై చాలా చాలా వార్తలు హల్ చల్ చేేశాయి. ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  సన్నిహితులు కొందరు ఆహ్వానితులకు ఫోన్ చేసి వెళ్లవద్దని సూచించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇదే పరిస్థితి తెలంగాణలోనూ  ఏర్పడింది. అయితే తెలంగాణలో కోమటి రెడ్డి వంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పుష్కర వర్థంతి సభకు దేన్నీ లెక్కబెట్టకుండా హాజరయ్యారు. తెలంగాణ నేతలకు ఉన్న తెంపు, ఆంధ్ర ప్రదేశ్ నేతలకు లేదా ? అని కూడా అప్పడు వార్తలు వెలువడ్డాయి. ఈ చర్చను కాసేపు పక్కన పెడదాం.  ఆంధ్ర ప్రదేశ్  రాజకీయాలలో అడుగు  పెట్టేందుకు ఇదే సరైన సమయం అని కొందరు షర్మిలకు సూచించినట్లు సమాచారం.  కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికలలో బిజీ బిజీ గా ఉందని, ఇప్పుడిప్పుడే ఏపి పై దృష్టి సారించే పరిస్థితి లేదని కొందరు రాజకీయ పరిశీలకులు  షర్మిల చెవిలో ఊదినట్లు మీడియా వర్గాల కథనం. పుష్కర వర్థంతి సభకు హాజరు కాని సీనియర్ కాంగ్రెస్ నేతలతో షర్మిల ఫోన్ లో సంభాషించారని, ఆశీస్సులు అందజేయవలసిందిగా కోరారని సమాచారం.   షర్మిల గ్రౌండ్ వర్క్ మొదలెట్టేసినట్లేనా ? జగన్ రియాక్షన్  ఏంటి ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: