వ్యాక్సీన్‌ సీక్రెట్‌: కొవాగ్జిన్‌, కోవిషీల్డ్ కలిస్తే అదిరే ఇమ్యూనిటీ..?

Chakravarthi Kalyan
కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే.. వ్యాక్సీన్ తప్ప మనకు వేరే ఆప్షన్‌ లేదు.. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మాస్కు, భౌతిక దూరాలే మార్గం.. ఇండియాలో ఇప్పటి వరకూ కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా ఇటీవల మరో టీకాకు కూడా కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే.. కొవాగ్జిన్, కోవిషీల్డ్‌ టీకాల్లో ఏది బెస్ట్ అనే చర్చ చాలా రోజులపాటు సాగింది. ఎవరికి తోచింది వాళ్లు చెప్పారు.

అదే సమయంలో ఈ రెండు టీకాలు కలిపి తీసుకుంటే ఎలా ఉంటుందన్న ఐడియా కూడా వచ్చింది. అంటే ఓ డోసు కొవాగ్జిన్‌.. మరో డోసు కోవీషీల్డ్ అన్నమాట. ఇలా టీకాల మేళవింపు విదేశాల్లో అమలు చేస్తున్నారు కూడా. కానీ ఇండియాలో మాత్రం ఇంకా అనుమతి రాలేదు. అయితే ఇండియాలో ఈ టీకాల మేళవింపుపై హైదరాబాద్‌లోని ప్రముఖ వైద్య సంస్థ ఏఐజీ పరిశోధన చేసింది. టీకాల మేళవింపుతో కోవిడ్ నుంచి మెరుగైన రక్షణ లభిస్తుందని ఈ ఏఐజీ ఆసుపత్రి పరిశోధనలో తేలిందట.

టీకాల మేళవింపు వల్ల ప్రయోజనాలు, ఏమేరకు సురక్షితమన్న అంశాలపై ఏఐజీ ఆసుపత్రి అధ్యయనం  చేసింది. కోవాగ్జిన్, కోవీషీల్డ్ మేళవింపుల విశ్లేషణపై దేశంలో జరిగిన మొట్టమొదటి అధ్యయనం ఇదే. కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్ లను మొదటి, రెండో డోసులుగా తీసుకోవటం సురక్షితమేనని ఈ అధ్యయనం తేల్చింది. అంతే కాదు.. ఇలా టీకాలు మేళవిస్తే.. యాంటీబాడీల ప్రతిస్పందన కూడా బాగా ఉంటుందట. టీకా వేసుకోని, కోవిడ్ వ్యాధి సోకని 330 మంది ఆరోగ్యవంతమైన వాలంటీర్లపై ఆధ్యయనం చేసి ఏఐజీ సంస్థ ఈ ఫలితాలు రాబట్టింది.


ఒకేరకం వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కన్నా.. రెండు రకాల వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో స్పైక్ ప్రోటీన్ ప్రతిరోధకాల ప్రతిస్పందన నాలుగు రెట్లుగా ఉందట. టీకాల మేళవింపు ఒమిక్రాన్ వేరియంట్‌కు వ్యతిరేకంగా టీకాల ప్రభావాన్ని మెరుగుపరుస్తుందని ఏఐజీ హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వివరించారు. మరి ఇండియాలో కూడా టీకాల మేళవింపుకు అనుమతి లభిస్తుందా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: