ట్రోల్ బాబూ ట్రోల్ : ఆ..మంత్రిని రీకాల్ చేయండి సర్...పనైపోద్ది!
వెంటనే మీరు దిగిపోండి
ఏం కాదు
మీరు చేసిన పనులు ఏవీ కూడా
మాకు నచ్చడం లేదు సర్ తప్పక
మీరు ఇంటికి పోయి రెస్టు తీసుకోండి
వింటున్నారా పేర్ని నానీ గారూ!
ఆంధ్రావని రాజకీయాలకు సంబంధించి మంత్రి పేర్ని నాని చెప్పేదే వేదం.. చేసిందే శాసనం..కనుక ఆయనేం చెప్పినా విని వదిలేయాలి లేదా విని తగువేసుకోవాలి ఆయనతో! అంతకుమించి ఆయన నుంచి ఏమీ ఆశించకూడదు. ఇప్పటికే అనేక వివాదాల్లో ఉంటూ తరుచూ వార్తల్లో నిలిచే సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేసి ఇరకాటంలో పడ్డారు మళ్లీ! ఓ సినిమా చూశాక (టికెట్ కొనుగోలు చేసి చూశాక) ఆ సినిమా నచ్చకపోతే టికెట్ ధర వెనక్కు ఇచ్చే అవకాశమే లేదని అన్నారు. బాబోయే భలే విడ్డూరం అయిన మాట. అసలు ఆయనేం మాట్లాడినా విడ్డూరమే కదా! మళ్లీ ఇందులో కొత్త ఏముందని?
ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతుంది. ఇంతవరకూ ఆ ప్రభుత్వం చేయాలనుకున్న పని ఒక్కటి కూడా చేయలేకపోయింది. ఏం చేయాలనుకున్నా అనాలోచిత నిర్ణయాల కారణంగానే అభాసుపాలవుతోంది. అలాంటప్పుడు వైసీపీ నిర్ణయాల వైఫల్యం కారణంగా ఈ ప్రభుత్వాన్ని రీ కాల్ చేయగలమా?
ఇంతవరకూ సినిమా టికెట్ల విషయమై ఇంత రాద్ధాంతం చేస్తున్న పేర్ని నాని వీళ్లు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా కోర్టు వాయిదాలకు, కోర్టు ఫీజులకు ఎంత డబ్బు వృథా చేశారో ఏనాడయినా ఆలోచించారా? అయినా కూడా పేర్ని నాని చెప్పిన విధంగా మనం సినిమా అన్నది నచ్చిన నచ్చకపోయినా చూశాక సదరు థియేటర్ ఓనర్ ని డబ్బులు వెనక్కు ఇచ్చేయమని చెప్పాలి. అదేవిధంగా అసమర్థ పాలన కారణంగా పాలనను ఇప్పటికీ గాడిలో పెట్టలేని మంత్రిగా పేర్ని నాని ని కూడా రీ కాల్ చేయించి ఇంటికే పరిమితం చేయాలని సుప్రీం కోర్టును అడుగుదాం.. ఏం కాదు? అసలే దినదిన గండం నూరేళ్లాయుష్షు అన్న విధంగా సినిమా థియేటర్లను పూర్తిగా భ్రష్టు పట్టిద్దాం అన్న ఆలోచనతో మంత్రి మాట్లాడుతున్నారా ఏంటి? ఒకవేళ థియేటర్ మూసుకుని పోతే దానిపై ఆధారపడ్డ కుటుంబాలకు మంత్రి గారు ఏమయినా ఉద్యోగాలు ఇప్పిస్తారా ఏంటి? ఆ విధంగా ఆయన మానవత్వం చాటుకుంటారా ఏంటి? ఏదేమైనప్పటికీ జనసేనాని మీద ఉన్న కోపం కారణంగా నోటికి వచ్చిందంతా మాట్లాడి మంత్రి నాని ఎందుకనో పరువు తీసుకునే బదులు హాయిగా పదవి వదిలేసి నాల్రోజులు ఇంటికే పరిమితం అయిపోతే మేలు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలియనప్పుడు పాలన సంగతి ఎలా పట్టించుకుంటారని? ఎలా గాడిన పెడతారని?