హ్యాపీ న్యూ ఇయర్: ఒమిక్రాన్ తో జాగ్రత్త...
పసందైన పాటలతో హుషారైన స్టెప్పులతో దేశ సైనికులు న్యూ ఇయర్ కి స్వాగతం పలికారు. చేదు జ్ఞాపకాలు, చెడు అనుభవాలు మిగిల్చిన 2021 సంవత్సరానికి గుడ్ బాయ్ చెబుతూ వచ్చిన నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచే జరగాలని కోటి ఆశలుతో 2022 నూతన సంవత్సరానికి ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇక ఒమిక్రాన్ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకల విషయానికి వస్తే ప్రస్తుతం దేశంలో వైరస్ వ్యాప్తి ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. అయితే రానున్న రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అన్న సందేహంతో ఉన్నా ఈ సంతోషమైన రోజును ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.
కొంత మంది మాత్రం కరోనా కొత్త వేరియంట్ భయంతో ఇంటి నుండి కనీసం బయటకు కూడా రాలేదు. గతంలో న్యూ ఇయర్ వేడుకల కంటే ఈ సారి కరోనా నేపథ్యంలో న్యూ ఇయర్ సందడి తక్కువనే చెప్పాలి. ఇంకా రెండు నెలల వరకు ఒమిక్రాన్ భయం ఉండనుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గత రెండు సంవత్సరాలలో కరోనా కారణంగా జరిగిన నష్టాన్ని తలుచుకుని ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కొత్త సంవత్సరంలో కరోనా మనల్ని వీడి వెళ్లిపోవాలని కోరుకుందాం.