చైనా షాక్.. ఆ దేశం యుద్ధానికి సిద్ధం?
ఈ క్రమంలోనే ఇప్పటికే భారత్ చైనా సరిహద్దు లో చైనా విస్తరణ వాద ధోరణి కారణంగా ప్రశాంతంగా ఉన్న సరిహద్దుల్లో కాస్త యుద్ధవాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే చైనా భారత్ మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతుంది అన్న విధంగా ఉంది పరిస్థితి. అదే సమయంలో జపాన్ తో కూడా చైనా వివాదానికి తెరలేపింది అన్న విషయం తెలిసిందే. జపాన్ కు సంబంధించిన దీవులు చైనాలోని భూభాగమే అంటూ వాధించడం మొదలు పెట్టింది. జపాన్ శంకకుచ్ దీవుల విషయంలో వెనక్కి తగ్గకపోవడంతో చైనావెనకడుగు వేసినట్లు కనిపించింది. కానీ ప్రస్తుతం చైనా వ్యవహరిస్తున్న తీరు మరోసారి చైనా జపాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కారణం అవ్వబోతుంది అని అంటున్నారు విశ్లేషకులు.
జపాన్ కు సంబంధించిన శంకకుచ్ దీవులను గతంలో చైనా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. జపాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. జపాన్ ప్రభుత్వ పాలనలో కి వచ్చే భూభాగాలు గా వాటిని ప్రకటించడంవాటిని.. కార్పొరేషన్లు గా చేయడం లాంటివి కూడా చేసింది. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లే అన్ని దారులను మూసివేస్తే చైనా జపాన్ కు షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే శంకకుచ్ దీవులను స్వాధీనం చేసుకోవడానికి అటు జపాన్ యుద్ధ విన్యాసాలు చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే చైనా జపాన్ మధ్య ఏ క్షణంలో యుద్ధం తలెత్తిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు అని అంటున్నారు విశ్లేషకులు. ఏం జరుగుతుందో చూడాలి.