గుడ్ న్యూస్ : వారి ఖాతాల్లోకి రూ.703కోట్లు..!
మరోవైపు ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాల కింద ప్రభుత్వం 134కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ నిధులను జిల్లాల వారీగా కేటాయించారు. ఏకగ్రీవమైన 2వేల 199 గ్రామాల పంచాయతీలకు ఈ నిధులు అందనున్నాయి. ఏకగ్రీవాల్లో 2వేల వరకు జనాభా కలిగిన పంచాయతీలకు 5లక్షల రూపాయలు, 2వేల నుంచి 5వేల లోపు జనాభా కలిగిన పంచాయతీలకు 10లక్షల రూపాయలు, 5వేల నుంచి 10వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు 15లక్షల రూపాయలు, 10వేల కంటే మించి జనాభా కలిగిన పంచాయతీలకు 20లక్షల రూపాయలు కేటాయించారు.
ఇక కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా అధికారులతో సమీక్ష చేపట్టిన సీఎం జగన్.. వైద్యశాఖలో ఉద్యోగాల భర్తీపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి నాటికి ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండాలన్న ఆయన.. అదే సమయానికి కొత్త నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే వైద్యఆరోగ్య శాఖలో సాధారణ బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.