వంగవీటిపై టీడీపీ గరంగరం... పార్టీలో పొగ పెట్టేస్తారా ?
వంశీ వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ కేడర్ రగిలి పోయింది. అలాంటి వల్లభనేని వంశీతో వంగవీటి రాధా అంట కాగడాన్ని టీడీపీ అధిష్టానం తో పాటు ఆ పార్టీ నేతలు ఎంత మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారట. అలాగే చంద్రబాబు, లోకే ష్ లను తీవ్రంగా విమర్శించే మంత్రి కొడాలి నానితో వంగవీటి రాధా చెట్టా పట్టాలే సుకుని తిరగడం కూడా పార్టీ కేడర్ కు రుచించడం లేదు.
ఇప్పుడు వంగవీటి వైసీపీ మంత్రి తో పాటు టీడీపీ గెలిచి వైసీపీ చెంత చేరిన ఎమ్మెల్యే తో క్లోజ్ గా ఉండడంతో టీడీపీ లో చాలా అనుమానాలు వస్తున్నాయి. రాధా ఇలా చేయడం ఏ మాత్రం బాగోలేదని.. ఆయనకు టీడీపీ లో ఉండడం ఇష్టం లేకపోతే పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని టీడీపీ నేతలు అంటున్నారు.
అయితే పార్టీ లోనే ఉంటూ.. పార్టీ కేడర్ మనోధైర్యం దెబ్బతీసేలా వ్యవహరిస్తే బాగుండదని చెపుతున్నారు. మరి రాధాను పార్టీ అధిష్టానం దీనిపై ఏదైనా వివరణ కోరుతుందేమో ? దీనిపై ఆయన ఎలా స్పందిస్తా రో ? చూడా లి.