
జగన్‌కు బ్లాక్ మెయిలింగ్ తప్పట్లేదా..?
ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టిడిపి వీక్ అయిపోయింది అని... ఇప్పుడు వైసీపీని కూడా కొంతవరకు దెబ్బ కొడితే ఏపీలో బీజేపీ పుంజుకునేందుకు అవకాశం ఉందని బీజేపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే సీఎం జగనే బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నాశనం అయిపోయిందని... అవసరమైతే కొందరు ఐపిఎస్ అధికారులను కేంద్రం రికాల్ చేసే అవకాశం ఉందని కూడా చెప్పారు.
రాష్ట్రంలో ఏం జరుగుతుందో ? హోంమంత్రి అమిత్ షా తో పాటు హోంశాఖ సెక్రటరీకి కూడా చెప్పానని... ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల ఆటలు ఇక సాగవని రమేష్ ఆరోపించారు. సీఎం రమేష్ ఆరోపణలు చూస్తుంటే అచ్చంగా ప్రభుత్వాన్ని బెదిరించి నట్టే కనిపిస్తోంది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కేంద్రానికి ఇప్పటివరకు తెలియటం లేదా ? అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ అధికారులను రీకాల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడూ అధికారం ఉంది. అయితే అది అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే జరుగుతుంది. రాష్ట్రంలో రాజకీయ కక్షలు ఉన్నాయే తప్ప శాంతిభద్రతల విషయంలో పెద్ద ఇబ్బంది అయితే లేదు. అయితే సీఎం రమేష్ మాత్రం ఏపీ ప్రభుత్వాన్ని ఏదో బెదిరించి... జగన్ ను బ్లాక్ మెయిల్ చేసి మాట్లాడినట్టు ఆయన మాటలు స్పష్టంగా చెబుతున్నాయి.