హైద‌రాబాద్‌లో మ‌రో కేపీహెచ్‌బీ.. ఎక్క‌డంటే..?

N ANJANEYULU
రోజు రోజుకు హైద‌రాబాద్ న‌గ‌రంలో కొత్త నివాసాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఒక కొత్త ప్రాంతంలో ముఖ్యంగా వ‌స‌తులు మెరుగ్గా ఉన్నాయి. మ‌రిన్నీ ప్ర‌ణాళిక ద‌శ‌లో ఉండ‌టంతో ఆ ప్రాంతం గృహ నిర్మాణాల‌కు ఎంతో చిరునామాగా మారింది. పెద్ద ఎత్తున బ‌హుళ అంత‌స్తుల నిర్మాణాలు కూడా వ‌స్తున్నాయి. కేవ‌లం అర‌గంట‌లోనే మియాపూర్ మెట్రో స్టేష‌న్ చేరుకునే స‌దుపాయం, ఔట‌ర్‌కు ఐటీ కారిడార్‌కు సైతం చేరువ‌లో ఉండ‌టంతో.. ఇక్క‌డ సొంత ఇల్లు కొనుగోలుకు దిగువ‌, ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వాసులు ఆసక్తి క‌న‌బ‌రుచుతూ ఉన్నారు.

కేపీహెచ్‌బీ, మియాపూర్‌, ప్ర‌గ‌తిన‌గ‌ర్, నిజాంపేట వంటి ప్రాంతాల‌కు కొన‌సాగింపుగా ఈ ప్రాంతం ఉండ‌టం నిజాంపేట మున్సిప‌ల్ ప‌రిధిలోకి రావ‌డం.. అభివృద్ధి ఉంటుంద‌నే అంచెనాల‌తో మొగ్గు చూపుతున్నారు.  ఒక‌ప్పుడు ఇది శివారు ప్రాంతంగా పేరు ఉన్న‌ది. కానీ ఇప్పుడు ఆ శివారు ప్రాంత‌మే ఎంతో అభివృద్ధి చెంది సిటీలో అక్క‌డే ఉండ‌డానికి ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఇక్క‌డ ఇదివ‌ర‌కు అన్ని ప‌రిశ్ర‌మ‌లే ఉండేవి. ఇప్పుడు ఆ ప‌రిశ్ర‌మ‌లు అన్నీ.. ఔట‌ర్‌కు అవ‌త‌లికీ త‌ర‌లిపోయాయి. అక్క‌డ భూముల ల‌భ్య‌త కూడా పెరిగిపోయింది. ముఖ్యంగా ఆర్‌1 జోన్ కింద‌కు మార‌డంతో ఇప్పుడు అక్క‌డ‌ పెద్ద ఎత్తున నివాస సముదాయాలు వ‌స్తున్నాయి.

ఇక్క‌డ ప‌లు ప్ర‌ముఖ కార్పొరేట్ స్థాయి పాఠ‌శాల‌లు, ఇంజినీరింగ్ క‌ళాశాల‌లు ఉండ‌టం సానుకూలంగా మారింది. అది మ‌రెక్క‌డో కాదు. ఒక‌ప్పుడు శివారు ప్రాంత‌మైన‌ బాచుప‌ల్లి. ఔట‌ర్ లో ఉన్న శివారు ప్రాంతాల‌లో కృష్ణాన‌దీ జ‌లాలు అందించేందుకు ప‌నులు కొన‌సాగుతున్నాయి.  ఒక‌ప్పుడు న‌గ‌ర శివారు ప్రాంత‌మైన వ‌న‌స్థ‌లిపురంలోని ఎన్‌జీఓస్‌కాల‌నీ, కేపీహెచ్‌బీ ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయో ఇప్పుడు బాచుప‌ల్లి కూడా అదేవిధంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఆంధ్రా సెటిల‌ర్లంద‌రూ దానికే ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారు. ఇది వ‌ర‌కు కేపీహెచ్‌బీ, ఎన్‌జీఓస్‌కాల‌నీ ప్రాంతాల‌లో ఏవిధంగా ఆంధ్రా సెటిల‌ర్లు ఎక్కువ‌గా ఉండేదో ఇప్పుడు బాచుప‌ల్లి అదేవిదంగా త‌యార‌వుతుంది. ఇక్క‌డ అన్నీ సౌక‌ర్యాలు ఉండ‌డంతో గృహాలు నిర్మించుకునేందుకు ఎక్కువ మంది ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నార‌ని బిల్డ‌ర్లు పేర్కొంటున్నారు.

         

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: