ఏంటిదీ?..అధికార పార్టీ నేతల్నీ కూడా వదలరా ?


ఇది అధికార పార్టీ నేతలకు కొరుకుడు పడని విషయం. ఏమీ చేయలేక, ఏమీ మాట్లాడలేక  గప్ చిప్ గా ఉండాల్సిన వచ్చిన సందర్భం. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు, రెవిన్యూ అధికారులూ సినిమాహాళ్లపై తనిఖీలు నిర్వహించారు.నిర్వహిస్తున్నారు. ఈ విషయం పై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది కూడా.  అయితే ఆ జిల్లా పోలీసులు, ఇతర ఉన్నతాధికారులూ  ఏకంగా అధికార పార్టీ పార్లమెంట్ సభ్యుడి సినిమా హాళ్లపై దాడులు చేశారు. ఇంతకీ  ఏవరా ఆ పార్లమెంట్ సభ్యుడు ?
నెల్లూరు జిల్లాలోని సినిమా హాళ్లపై పోలీసులు, రెవిన్యూ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరు నగరంలో పోలీసు ఉన్నతాధికారులు గ్రూప్ థియేటర్ల పై కూడా దాడులుచేశారు. సినిమా హాళ్ల ను నిశితంగా పరిశీలించారు. అంగుళం అంగుళం శోధించారు. ప్రేక్షకులతో సంభాషించారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులే స్వయంగా ఈ తనిఖీల్లో పాల్గోన్నారు. నగరంలో ని రెయిన్ థియేటర్ మాల్ లోనూ, పక్కనే ఉన్న ఎం.జి మాల్ తో సహా అన్ని థియేటర్ల లోనూ ఈ తనిఖీలు జరిగాయి.  ఈ ఘటన సినిమాహాళ్ల  నిర్వాహణ సిబ్బందిని నివ్వెర పరచింది. నెల్లూరు నగరంలో  చాలా సినిమా  థియేటర్లు  ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబానికి చెందినవి. సినీ రంగంతో పరిచయం ఉన్న వారికి అందరికీ ఈ విషయం తెలిసినదే.
ఒంగోలు పార్లమెంట్ కు గతంలో ప్రాతినిథ్యం వహించిన దివంగత నేత మాగుంట సుబ్బరామి రెడ్డి హయాంలో నెల్లూరులో  మాగుంట గ్రూప్ థియేటర్స్ ను నెలకొల్పారు. సినీమా హాళ్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్ల రోజుల్లో నెల్లూరు నగరంలో వారికి దాదాపు పాతిక కు పైగా సినిమాహాళ్లు ఉండేవి. అందులో కొన్ని సొంతమైనవి కాగా, మరికొన్ని ఆ కుటుంబం లీజుకు తీసుకున్నవి కావడం గమనార్హం. నాటి నుంచి నేేటి వరకూ ఆ కుటుంబం సినిమా హాళ్ల వ్యాపారంలో ఉంది.
తాజాగా నెల్లురు నగరంలో అన్ని సినిమా హాళ్ల పై పోలీసు అధికారులు దాడులు చేశారు. వాటిలో మాగుంట కుటుంబానికి చెందినవి కూడా ఉండటం గమనార్హం. అయితే తమ పార్టీ  పార్లమెంట్ సభ్యుడికి చెందిన సినిమా హాళ్లపై అధికారులు తనిఖీలు చేస్తున్నా వై.ఎస్.అర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలాంటి స్పదన వ్యక్తం చేయలేదు. ఈ ఘటన నగంరలోని వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: