కేటీఆర్‌ని క్రాస్ చేస్తున్న ఈటల-బండి..ఈ సారి కారుకు డ్యామేజే?
గత ఎన్నికల్లో కారు దాదాపు క్లీన్‌స్వీప్ చేసినంత పనిచేసింది. జిల్లాలో 13 సీట్లు ఉంటే టీఆర్ఎస్ 12 సీట్లు గెలిచేసింది. ఒక మంథనిలో మాత్రం కాంగ్రెస్ గెలిచింది. ఇలా కారు హవా ఉన్న కరీంనగర్‌లో కమలం దూకుడుగా ఉంటుంది. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లోనే ఇక్కడ సీన్ మారిపోయింది. కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి బండి సంజయ్ సత్తా చాటారు. ఇప్పుడు ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా టీఆర్ఎస్‌కు చుక్కలు చూపిస్తున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ బయటకొచ్చి...హుజూర్‌బాద్ బరిలో మళ్ళీ గెలవడంతో సీన్ మొత్తం మారిపోయింది.
ఇక్కడ బీజేపీ అనూహ్యంగా రేసులోకి వచ్చింది. ఈటల-బండిల దెబ్బకు కరీంనగర్‌లో కారు షేక్ అయ్యే పరిస్తితి వచ్చింది. ఇప్పటికే వారు జిల్లాలో బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో వైపు కేటీఆర్ జిల్లాలో కారు బలం తగ్గకుండా ప్రయత్నిస్తున్నారు...కానీ ఆ ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ అయ్యేలా లేవు.
ఎందుకంటే ఇప్పటికే రెండు సార్లు గెలవడంతో జిల్లాలో కారు రివర్స్ అయ్యే పరిస్తితి వచ్చింది. మెజారిటీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తోంది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తీవ్ర వ్యతిరేకత ఎదురుకుంటున్నారు. అలాగే పెద్దపల్లి, చొప్పదండి ఎమ్మెల్యేల పరిస్తితి కూడా అంత ఆశాజనకంగా లేదు. ధర్మపురి, జగిత్యాలలో కూడా కారు రివర్స్ అయ్యే పరిస్తితి. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌కు కూడా ఈ సారి గెలవడం అంత ఈజీ కాదు. మొత్తానికి కరీంనగర్‌లో కారుకు భారీ డ్యామేజ్ జరిగేలా ఉంది.