తెలంగాణ‌ను క‌మ్మేస్తోన్న ఒమిక్రాన్‌... ఎన్ని కొత్త కేసులు అంటే..!

VUYYURU SUBHASH
రెండు సంవత్సరాలుగా ప్రపంచాన్ని తీవ్రంగా వణికిస్తున్న కరోనా వైరస్ ఎప్పటికప్పుడు సరికొత్త గా రూపాంతరం చెందుతోంది. కోట్లాది మంది ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ వైర‌స్‌ వచ్చింది. ఈ వైరస్ దెబ్బతో అమెరికా , కెనడా తో పాటు యూరప్ దేశాలు వ‌ణికి పోతున్నాయి. ఆఫ్రికా ఖండంలోని దక్షిణాఫ్రికా దేశంలో పుట్టిన ఈ వైరస్ మన దేశంలో కి కాస్త ఆలస్యంగా నే ఎంట్రీ ఇచ్చిందని చెప్పాలి.

ఇప్పటి వరకు ఉన్న కరోనా వైరస్ లో అన్నిటికంటే ప్రమాదకరమైన వేరియంట్ గా ఒమిక్రాన్ వైరస్ ను పేర్కొంటున్నా రు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకు కేవలం ఒకటి రెండు కేసులు మాత్రమే వెలుగు చూస్తున్న వేళ తాజాగా ఇప్పుడు మన దేశంలో కేసులు అధికారికంగానే వందకు పైగా దాటేశాయి.

ఇక తెలంగాణ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు ద్వారా ఇత‌ర దేశాల నుంచి భారీ ఎత్తున ప్ర‌యాణికులు వ‌స్తున్నారు. దీంతో తెలంగాణ లో ఈ కేసులు చాప‌కింద నీరులా విస్త‌రిస్తున్నాయి. తాజాగా శంషా బాద్ ఎయిర్ పోర్టు కు వ‌చ్చిన ప్ర‌యాణికుల‌కు ప‌రీక్ష‌లు చేస్తే వారిలో న‌లుగురికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. వారిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉందా ?  లేదా ? అన్న‌ది నిర్దారిస్తున్నారు.

ఇక తెలంగాణ లో ప్ర‌స్తుతం క‌రోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. అధికారికంగానే ఎక్కువ కేసులు వ‌స్తున్నాయి. అన‌ధికారికంగా ఇవి మ‌రిన్ని ఎక్కువే ఉంటాయంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 182 కొవిడ్ కేసులు నమోదుకాగా... ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3610 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. ఏదేమైనా అక్క‌డ తాజాగా హైకోర్టు ఇచ్చిన గైడ్‌లెన్స్ ప్ర‌కారం క‌ఠినంగా నిబంధ‌న‌లు అమ‌లు చేయాల్సి ఉంది. లేని పక్షంలో ఒమిక్రాన్ కేసులు పెరిగి పోనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: