వైసీపీ పై బి.జె.పి అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. ఈ నెల 28న విజయవాడలో బి.జె.పి బహిరంగ సభ నిర్వహిస్తామని.. వై.సి.పి ప్రభుత్వం పై ప్రజల నిరసన గళాన్ని బహిరంగ సభద్వారా తెలియజేస్తామన్నారు. వై.సి.పి ప్రభుత్వం పై దండెత్తడానికి బిజెపి నిర్ణయం తీసుకుం దని.. బహిరంగ సభ వేదికగా మా కార్యచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ప్రజలంతా వైసిపి పాలన అంటే విసుగు చెందారని.. యువత కు ఉద్యోగాలు ఇవ్వరు... ఉన్న ఉద్యోగులకు జీతాలు అందవని ఆగ్రహించారు సోము వీర్రాజు. రూ. 50వేల కోట్లతో కేంద్రం ఎపిలో జాతీయ రహదారుల అభివృద్ధి చేసిందని.. వై.సి.పి ప్రభుత్వం చిన్న గుంతకూడా పూడ్చలేదని మండిపడ్డారు సోము వీర్రాజు.
ఏ స మస్య పైనా కూ డా ముఖ్య మంత్రి నేరుగా మాట్లాడరని.. కేవలం ముఖ్యమంత్రి సలహాదారులు మాత్రమే మాట్లాడతారని ఓ రేంజ్ లో రెచ్చి పోయారు సోము వీర్రాజు. ఈ శాడిస్ట్ ప్రభుత్వానికి మార్పు రాదని భావించి ప్రజల గొంతుకను బిజెపి భహిరంగ సభ ద్వారా వినిపిస్తామని స్పష్టం చేశారు సోము వీర్రాజు. అటు వైసిపి నేత సుబ్బారావు పై జరిగిన భౌతిక దాడిని ఖండించారు ఏపీ బీజేపీ ఎంపీలు టీజీ వెంకటేష్, సుజనాచౌదరి, జి.వి.ఎల్. చంపుతానని బెదిరించే వారిని, తాగి వాహనం న డిపి ప్రజల ప్రాణాలను తీసే వారిని ఉరి వేయాలని... సుబ్బారావు కు టుంబానికి న్యాయం చేసేలా ముందుకు వెళ్తామన్నారు. సుబ్బారావు త ల్లి ని దర్బాషలాడడం, కొట్టడం క్షమించరాని నేరమని.. సుబ్బారావు పై దౌర్జన్యం చేసిన వారిపై మంత్రి బాలినేని చర్యలు తీసుకోవాలని పేర్కొ న్నారు. వైసిపి నేత సుబ్బారావు గుప్తా పై సొంత పార్టీ వాళ్ళు దాడి చేయడం అమానుషమని... సుబ్బారావు పై జరిగిన దౌర్జన్యానికి సరైన రీతిలో సమిష్టి గా స్పందిస్తామని వెల్లడించారు.