భారత్ సిద్ధమైంది.. 15వేల బ్రహ్మోస్ మిస్సైల్స్ సరిహద్దుల్లో?

praveen
భారత్ చైనా సరిహద్దుల్లో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చైనా ఉద్రిక్తంగా మార్చింది. భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకుని భారత్ పై ఆధిపత్యం సాధించడమే లక్ష్యంగా సరిహద్దుల్లో ఎన్నో కుట్రలు పన్నుతోంది చైనా. ఈ క్రమంలోనే గత కొన్ని నెలల నుంచి భారత్ చైనా సరిహద్దు లో వాతావరణం ఎంతో హాట్ హాట్ గానే ఉంది అని చెప్పాలి. వణుకు పుట్టించే చలిలో కూడా ఇరు దేశాల మధ్య వివాదం మంట పుట్టించేలా ఉంది. అయితే చైనాతో వివాదం ఒక రకంగా భారత్ కు ప్లస్ అయి ఉంది అని చెప్పాలి.. ఎందుకంటే చైనాతో ఎప్పుడూ యుద్ధం వస్తుందో తెలియదు కాబట్టి రక్షణ రంగాన్ని పటిష్టంగా  మార్చుకునేందుకు భారత ప్రభుత్వం ఆయుధాల సమీకరణ చేస్తుంది. ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయడమే కాదు సొంతంగా కూడా ఆయుధాలను తయారు చేస్తూ  ఉపయోగాలు నిర్వహించి భారత అమ్ములపొదిలో చేరుస్తూ ఉండటం గమనార్హం.


 అయితే సరిహద్దులో చైనా కవ్వింపు లకు  పాల్పడినప్పుడు  భారత్ ఎదురుదాడి చేసుకుంటూ వచ్చింది. అయితే ఈ దాడి ఆయుధంతో కాకుండా ఆయుధ  రహితంగానే జరిగాయి అనే విషయం తెలిసిందే. కానీ భారత్ చైనా సరిహద్దు లో ఏ క్షణం లో ఏదైనా జరగొచ్చు అనే విధంగానే ఉన్నాయి పరిస్థితులు. ఈ క్రమంలోనే ఇక సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంది.


 ఈ క్రమంలోనే 15 వేలకు పైగానే బ్రహ్మాస్ మిస్సైల్స్    సరిహద్దుల్లో ఎంతో అప్రమత్తంగా ఉన్నాయి అంటూ అంతర్జాతీయ రక్షణ నిపుణులు అంచనా వేస్తూ ఉండటం గమనార్హం. అంతేకాకుండా ఎయిర్ పోర్ట్ కోసం 1500 ఆకాష్ మిస్సైల్ సరిహద్దుల్లో ఉంచినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మరో 8500 మిస్సైల్  ను అటు సరిహద్దుల్లోకి పంపించేందుకు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. ఇలా ప్రపంచ దేశాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ విభాగాలు చెబుతూ ఉండటం గమనార్హం. ఇలా చైనా ఏమాత్రం దూకుడుగా వ్యవహరించిన కూడా చెక్ పెట్టేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రపంచ రక్షణ రంగ నిపుణులు చెబుతుండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: