జగన్‌@49: పేదల చదువుకు పెట్టని కోట..!

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు ఇవాళ.. ఆయన పాలనలో చదువుకు చాలా ప్రాముఖ్యత లభిస్తోంది. ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ విద్యాలయాల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ విద్యారంగంలో జగన్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. జగన్ తీసుకొచ్చిన ఈ మార్పులన్నింటికీ కేంద్రం నిరుపేద విద్యార్థులే. పేదలకూ అత్యున్నత చదువులు అందాలన్న లక్ష్యంగా ఆయన ఎన్నో పథకాలు సృష్టించారు.


బడికి వెళ్లడాన్ని ప్రోత్సహించేందుకు జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా పిల్లలను బడికి పంపించే అమ్మలకు వారి ఖాతాల్లో రూ. 15 వేలు జమ చేస్తోంది. ఇవి కాకుండా జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన‌, విద్యా  దీవెన‌ పథకాలు అమలు చేస్తోంది. జ‌గ‌న‌న్న గోరుముద్ద పేరుతో పోషకాహారం అందిస్తోంది. జ‌గ‌న‌న్న విద్యా కానుక‌ పేరుతో పేదలకు బడికి వెళ్లేందుకు అవసరమైన అన్ని వస్తువులతో కూడిన కిట్ అందిస్తోంది. పిల్లలకు బూట్లు, బెల్టులు, బ్యాగులు కూడా ఈ పథకం ద్వారా పేద పిల్లలకు అందిస్తున్నారు.


ఇంకా ప్రభుత్వ బడుల స్వరూపాన్ని మార్చివేసేందు జగన్ వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. దీని కోసం  నాడు-నేడు అనే పథకం తీసుకొచ్చారు. అంతే కాదు.. పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేలా మార్పులు చేశారు. ఇలా జగన్ సర్కారు పేద విద్యార్థుల కోసం తీసుకొచ్చిన కొత్త మార్పులు ఎన్నో.. ఏపీలో విద్యారంగం అభివృద్ధికి జగన్‌ చేపట్టిన సంస్కరణలు క్రమంగా ఫలితాలు ఇస్తున్నాయి. వివిధ కేటగిరీల్లో ఏపీ దేశంలో ముందు వరుసలో నిలుస్తోంది. ఏపీలో పాఠశాల విద్యలో తీసుకువచ్చిన సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం క్రమంగా కనిపిస్తోంది.


ఇటీవల ప్రధాని ఎకనమిక్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ విడుదల చేసిన నివేదికలో ఫౌండేషన్‌ విద్య అందుబాటు అంశంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. చిన్న రాష్ట్రాల కేటగిరీలో  విద్య అందుబాటు అనే అంశంలో ఏపీ 38.50 స్కోరుతో ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: