వావ్ : ఆర్టీసీ ఆస్తులపై వైసీపీ కన్ను ఎందుకంటే?
ఆర్టీసీని గాడీలో పెట్టారని జగన్ ను అంతా ప్రశంసించారు. అందుకు కారణం అయిన ప్రతి నిర్ణయాన్నీ అభినందించారు. విలీనంతో ఆర్టీసీ బతుకే మారిపోతుందని ఊహించారు. రేపటి నుంచి నష్టాల ఊబి నుంచి ఆర్టీసీ గట్టెక్కడం ఖాయం అని చాలా మంది ఆశించారు. ఉద్యోగులు కూడా జగన్ కు బాసటగా నిలిచారు. అందుకే కేసీఆర్ చేయలేని పని జగన్ చేసినందుకు అంతా వైసీపీ బాస్ ను అభినందించారు. కానీ ఇక్కడే అసలు మతలబు ఉంది. అప్పులతో నెట్టుకు వస్తున్న ప్రభుత్వానికి ఆర్టీసీ ఆస్తులు కావాలి. ఆర్టీసీలో సంస్థ భవిష్యత్ అవసరాల కోసం, ఉద్యోగులంతా కలసి దాచుకున్న పీఎఫ్ కోసం ఉంచిన డబ్బు జగన్ కు కావాలి. ఎందుకంటే స్టేట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు నిధులు లేవు. నిధులు వస్తే లేదా ఇలా అప్పణంగా దోచుకుంటే అప్పుడు సంక్షేమ పథకాలకు నిధులు ఇవ్వడం సులువు అవుతుందని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ ఆరోపణ ఎలా ఉన్నా త్వరలో ఆర్టీసీ పెద్ద బస్ స్టేషన్లన్నీ ప్రయివేటీకరణ వైపు మళ్లనున్నాయి.