రాజధాని రచ్చ: జనంపై బాబు-జగన్ పైచేయి!
ప్రతి అంశంలోనూ ఈ రెండు పార్టీలు రాజకీయమే చేస్తున్నాయి. ఇందులో ఎలాంటి డౌట్ లేదు..ఇలా చేస్తే ఎంత లబ్ది..అలా చేస్తే ఎంత లాభం అనే కోణంలోనే మాత్రమే పార్టీలు ముందుకెళుతున్నాయి. ఇలా రాజకీయం చేయడం వల్లే...ఇప్పటికీ ఏపీకి రాజధాని ఏది అనేది తెలియకుండా పోయింది. ఎవరైనా పక్క రాష్ట్రం వాళ్ళు..మీ రాజధాని ఏది అంటే...ఏదో చెప్పలేని పరిస్తితిలో ఏపీ ప్రజలు ఉన్నారు.
ఇలా దేశంలో రాజధాని లేకుండా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే...అది ఏపీ మాత్రమే. అందుకే ఏపీ అన్నిరకాలుగా వెనుకబడి ఉంటుంది. అసలు వైసీపీ-టీడీపీలు గానీ...తమ రాజకీయ లాభం మాత్రమే చూసుకుంటున్నాయి తప్ప...రాజధాని అనేది నిర్ణయించాలనే పని మాత్రం చేయడం లేదు. టీడీపీ ఏమో అమరావతి అంటుంది..వైసీపీ ఏమో మూడు రాజధానులు అంటుంది. ఇలా రెండు పార్టీలు రాజధాని అంశంపై రచ్చ చేస్తున్నాయి.
అసలు ఎవరి దారి వారిదే అన్నట్లు ఉంది. పైగా ఇప్పుడు పోటాపోటిగా ఉద్యమం చేయడానికి రెడీ అయ్యాయి. రాజధాని విషయంలో ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని చంద్రబాబు, జగన్‌లు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఇద్దరు నేతలు పైచేయి సాధిస్తున్నారు...కాకపోతే వారు జనంపై పైచేయి సాధిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలని గాలికొదిలేసి....రాజధాని పేరుతో రాజకీయ క్రీడకు తెరలేపారు. దీని వల్ల జనం నష్టపోతున్నారు తప్ప...నాయకులు నష్టపోవడం లేదు. మరి రాజధాని రచ్చ ఎప్పటికీ ఆగుతుందో?