కరోనా కాటుకు కళావికలమైన కార్మికులు.. ఆదుకునే దెవరు..!
సామాన్య ప్రజానీకం కార్మిక కర్షకులు దేశ సంపదను పెంచడంతోపాటు ఉత్పత్తి ప్రక్రియలో భాగస్వాముల అవుతూనే ప్రజలకు తిండి పెట్టి ప్రజల పక్షాన నిలుస్తున్నారు. అలాంటి కార్మిక కర్షకుల ను ఆపదలో ఇబ్బందుల్లో ఆదుకొని భరోసా ఇవ్వాల్సిన టువంటి బాధ్యత రచయితలు మేధావులు ప్రజాసంఘాల కార్యకర్తలపై ఎంతగానో ఉన్నది. చట్టసభలలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా ప్రజల పక్షాన నిలిచి పోరాడిన వలసినది పోయి అవసరాన్ని బట్టి అధికార పార్టీతో కుమ్మక్కు అవుతున్న సందర్భాలు అనేకం. గ్రామపంచాయతీ నుండి మొదలుకొని పార్లమెంటు వరకు అదే తంతు కొనసాగుతోంది. ప్రపంచ దేశాల రాజ్యాంగాల నుండి భారత దేశానికి అవసరమైన టువంటి అంశాలను తీసుకొని ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని సమకూర్చుకున్న ప్పటికీ రాజ్యాంగ ఫలాలు క్రింది స్థాయికి అందడం లేదు. పాలకుల చిత్తశుద్ధి లోపం, రాజకీయలబ్ధి, మితిమీరిన అవినీతి పేదరికం మరి పెరిగిపోవడానికి కారణం అవుతున్నవి.
50 శాతం గా ఉన్నటువంటి పేద వర్గాల చేతిలో ఎలాంటి జాతీయ సంపద లేకపోవడం దారుణము. 57 శాతం సంపద 10 శాతం గా ఉన్నటువంటి ఉన్నత వర్గాల చేతిలో ఉండడం వలన రోజురోజుకు పేదరికం మరీ పెరిగిపోతూ ఉంది. 1985 తర్వాత మాత్రమే పేదరికం ఈ దేశంలో మరీ పెరిగిపోయింది .అంటే కార్పొరేట్ సంస్థల ఆవిర్భావం వల్లనే అది సాధ్యమైందని తెలుసుకోవాలి. అందుకే మనసున్న ప్రతివారు, సామాజిక స్పృహతో ఆలోచించేవాళ్లు, మేధావులు, సామాజిక కార్యకర్తలు ఈ పేదరికం గురించి అణచివేతకు వివక్షతకు అసమానతలకు బలవుతున్న వారి గురించి ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచనే నేరం అవుతున్నది. అణచివేతకు బలవుతూ చేయని నేరానికి ప్రజా దృక్పథం కలిగి ఉన్నందుకు జైలు శిక్ష అనుభవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. అందరికీ తెలుసు కదా..! అందుకే మేధావులు విసిగిపోయి అలసిపోయి సిద్ధాంతాలను ఆచరణ రూపంలో చూడలేక నిర్వేదానికి గురవుతున్నారు. నిద్ర పోతున్నట్లు గా నటిస్తున్న ప్రభుత్వాలను నిద్ర లేప లేక పోతున్నారు. అంటే ప్రజలు ఎక్కడికక్కడ చైతన్యవంతులు అయితే తప్ప ప్రభుత్వాల మొద్దునిద్ర ను వదిలించలేమా..