ఈ బామ్మకు హాట్సాఫ్.. 70 ఏళ్ళ వయసులో కూడా?

praveen
ఇటీవలి కాలంలో యువత ఎక్కడ కెరీర్ పై దృష్టి పెట్టడం లేదు. ముఖ్యంగా పని పాట లేకుండా జులాయిగా తిరుగుతున్నారు. ఇలాంటి వారు నేటి రోజుల్లో  ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నారు. బాధ్యతగా మెలుగుతూ కుటుంబ బాధ్యతలను అర్థం చేసుకుంటూవచ్చిన దాంట్లో కుటుంబాన్ని చూసుకుంటున్న వారుచాలా అరుదుగా కనిపిస్తున్నారు. అయితే నేటి రోజుల్లో యువత పనిచేయడానికి బద్ధకస్తులు గా మారిపోతూ ఉంటే.. ఇప్పటికీ ఎంతోమంది  వృద్ధులు ఇక  జీవనం సాగించేందుకు ఇంకా పని చేసుకుంటూ ఉండడం మాత్రం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది అని చెప్పాలి.


 కృష్ణా రామా అనుకుంటూ ఇంట్లో కూర్చొని హాయిగా రెస్ట్ తీసుకో వలసిన సమయం లో పొట్టకూటి కోసం ఇప్పటికీ ఎంతగానో కష్టపడుతూ డబ్బు సంపాదిస్తూ తమ కాళ్ళమీద తాము బ్రతుకుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.70, 80 ఏళ్ళు దాటినప్పటికీ ఇప్పటికీ ఎంతో మంది వృద్ధులు పని చేసుకుంటూ వచ్చిన డబ్బులతో సొంతంగా జీవనం సాగిస్తూ ఉండడం ఎవరి మీదా ఆధారపడకూడదు అనుకోవడం  మాత్రంనేటి రోజుల్లో ఆదర్శంగా నిలుస్తుంది. ఇలా ఇప్పటి వరకూ ఎంతో మంది వృద్ధులు తమకు వచ్చిన పని చేసుకుంటూ హాయిగా జీవనం సాగిస్తున్నారు. ఇలా ఎవరి కాళ్ళమీద వాళ్ళు నిలబడి జీవిస్తే ఆ సంతృప్తి వేరే ఉంటుంది అని సమాధానం కూడా చెబుతున్నారు.



 ఇక్కడ 70 ఏళ్ల వృద్ధ జంట కూడా ఇంకా  పొట్టకూటి కోసం కష్టపడుతూ.. జీవన పోరాటం చేస్తూనే ఉండటం మాత్రం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది అని చెప్పాలి.  మహారాష్ట్రలో ఘటన వెలుగులోకి వచ్చింది. నాగపూర్ కు చెందిన 70 ఏళ్ల వృద్ధ జంట కడుపు నింపుకునేందుకు పొద్దటి నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నారు. రోడ్డు పక్కన స్పెషల్ నాస్తా తర్రి పోహా  అమ్ముతూ ఎవరి ఆధారం లేకుండా తమ కాళ్లపై తాము బ్రతుకుతున్నారు. రుచి కరమైన ననాస్తా  కేవలం పది రూపాయలకి అమ్ముతూ ఎంతోమంది కడుపు నింపుతూ ఎంతో సంతృప్తి చెందుతున్నారు. ఒక నెటిజన్ వీరి గురించి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో  ఇక ఈ వృద్ధ దంపతుల పట్టుదలకు గురించి తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: