చిత్తూరు జిల్లా ఎగువ రేగడకు చెందిన సాయితేజ భౌతిక కాయాన్ని ఇవాళ బెంగళూరు నుంచి మదనపల్లికి చేరుకుంది. మదన పల్లి చేరుకున్న తరువాత దాదాపు మదనపల్లి నుంచి ఎగువరేగడ వరకు అంతిమ యాత్ర దాదాపు 30 కిలో మీటర్ల వరకు అంతిమ యాత్ర కొనసాతుంది. జై జవాన్.. సైనికుడు సాయికి వీడ్కోలు అంటూ నినాదాలు చేసారు. జనం గుండెల్లో జవాన్ సాయితేజ నిలిచిపోయాడు. ర్యాలీ ఇంతపెద్దగా ఉంటుందని ఎవరూ అసలు ఊహించలేదు. మదపల్లి వాసులతో పాటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు.
సాయితేజకు కడసారి వీడ్కోలు పలుకేందుకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ అంతిమయాత్రలో పాల్గొని వీరుడికి వీడ్కోలు పలికారు. చిత్తూరు జిల్లా ఎగువరేగడ ముద్దుబిడ్డ సాయితేజ 1993లో జన్మించాడు. చిన్న వయస్సు నుంచే కష్టపడి ఆర్మీలో జాయిన్ అయ్యారు. ఆ తరువాత కొద్ది రోజులకే త్రివిద దళాల అధిపతి అయిన బిపిన్ రావత్ వద్ద సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహించారు. అతని అంతిమ యాత్రలో ప్రజలందరూ జాతీయ జెండాలు చేతబట్టి.. మరొక వైపు యువత బైకు ర్యాలీ నిర్వహించి జై జవాన్ అనేనినాదాలతో మదనపల్లి నుంచి ఎగువరేగడ వరకు ర్యాలీలో నినాదాలు మారు మోగాయి.
ఈ ర్యాలీలో వేలాది మంది ప్రజలు రావడంతో చూసే వారందరూ ఆశ్యర్యానికి గురవుతున్నారు. ఇంత మంది ఒక సైనికుడికి మద్దతు తెలపడం.. ఆంధ్రప్రదేశ్లోనే తొలిసారి అని పేర్కొంటున్నారు. అదేవిధంగా సైనికుడు సాయితేజ కుటుంబాన్నీ ప్రతీ ఒక్కరూ ఆదుకోవాలని.. భార్య, బిడ్డలకు ప్రభుత్వం మంచి విద్యనందించాలి అని కొంత మంది కోరుతున్నారు. అలాగే ఎన్టీఆర్ రోడ్డుకు సాయితేజ రోడ్డు పేరు పెట్టాలని మదనపల్లి వాసులు కోరుతున్నారు. అమర్ రహే సాయితేజ అంటూ ర్యాలీ కొనసాగుతూ ఉంది. వీరుడి సాయితేజకు వందనం పలకాలనే ఉద్దేశంతో అందరూ ర్యాలీలో పాల్గొని విజయోత్సవంగా.. త్రివర్ణ పతాక జెండాలు చేతపట్టుకొని అంతిమయాత్రలో పాల్గొన్నారు.