సురేష్ ఎఫెక్ట్: వైసీపీకి డ్యామేజేనా?
ఆ పార్టీ...ఈ పార్టీ అని లేదు...వైసీపీ, టీడీపీ నేతలు బూతులు మాట్లాడుతున్నారు. అయితే అలా మాట్లాడటం వల్ల ఎదుటవాళ్ళకు నష్టం మాత్రం జరగదనే చెప్పాలి. బూతులు మాట్లాడిన వారికే నష్టం జరుగుతుందని చెప్పాలి. అది ఇప్పటికిప్పుడు నష్టం కనబడకపోయినా, భవిష్యత్‌లో మాత్రం ఎఫెక్ట్ అవ్వడం గ్యారెంటీ అని చెప్పొచ్చు..ఆ మధ్య టీడీపీ నేత పట్టాభి...సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్‌లని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కావొచ్చు...ఇటీవల వల్లభనేని వంశీ...అంబటి రాంబాబు, చంద్రశేఖర్ రెడ్డి, కొడాలి నానిలు...చంద్రబాబుని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కావొచ్చు...ఇవి ఎప్పటికైనా రివర్స్ అయ్యి డ్యామేజ్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు ఇటీవల చంద్రబాబు భార్య భువనేశ్వరి విషయంలో ఎంత రచ్చ అయిందో అందరికీ తెలిసిందే. వైసీపీ నేతలు మాట్లాడిన మాటలు..తిరిగి ఆ పార్టీకే డ్యామేజ్ అయ్యే పరిస్తితి వచ్చింది.
ఇక తాజాగా లోక్‌సభలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుని ఉద్దేశించి...వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఒక బూతు తిట్టారని కథనాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా రఘురామనే మీడియాతో చెప్పారు. అలాగే లోక్‌సభ స్పీకర్‌కు, ప్రధాని మోదీలకు ఆయన ఫిర్యాదు చేశారు. సురేష్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే లోక్‌సభలో ఏం జరిగిందో...వైసీపీ ఎంపీలకు, రఘురామకే తెలియాలి. కానీ రఘురామ చెబుతున్నా ప్రకారం...సురేష్ బూతులు మాట్లాడారని తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని రఘురామకు మద్ధతు ఇచ్చే వర్గాలు నమ్ముతున్నాయి. పైగా రఘురామకు ఇప్పుడు తన సొంత వర్గం రాజుల మద్ధతు బాగా పెరుగుతుంది. వారు కూడా సురేష్ తీరుని ఖండిస్తున్నారు. మొత్తానికైతే ఎంపీ సురేష్ తీరు వల్ల వైసీపీకే డ్యామేజ్ జరిగేలా ఉంది.