జనవరిలోనే జగన్ ఆ యాత్ర...?

Gullapally Rajesh
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్దగా ప్రజల్లోకి వెళ్లిన సందర్భం అంటూ ఏదీ లేదని చెప్పాలి. ఇటీవల రాయలసీమ ప్రాంతంలో భారీగా వరద వచ్చిన నేపథ్యంలో జగన్ రెడ్డి నేరుగా ప్రజలతో మాట్లాడి వాళ్లకు కాస్త భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఈ అంశానికి సంబంధించి కాస్త సీరియస్ గా దృష్టి పెట్టారనే నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళ్లి వాళ్లను కలిసి ఆర్థిక సహాయం గురించి అదేవిధంగా భవిష్యత్తు గురించి కాస్త మాట్లాడే ప్రయత్నం చేశారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికార పార్టీ ప్రజల్లోకి వెళ్లకపోతే గతంలో తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న ఇబ్బందులను కచ్చితంగా ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాస్త జాగ్రత్తగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత ఏడాది నుంచి జగన్ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని ప్రజలతో మాట్లాడే అవకాశం ఉందని ప్రజల కష్టాలను తెలుసుకుని అలాగే సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా ఆరా తీసే అవకాశం ఉందని ఎప్పటికప్పుడు వార్తలు వచ్చినా సరే అది నిజం కాదని తెలిసింది.
అయితే ముఖ్యమంత్రి వైయస్ జగన్ త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ గా ఉన్నారని జనవరి 26 తర్వాత నుంచి జగన్ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని కొన్ని ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది అందరూ కూడా ఉత్కంఠగా చూస్తున్నారు. అయితే గతంలో మాదిరిగా ఆయన రచ్చబండ కంటే కూడా కాస్త విభిన్నంగా ఆలోచించి అవకాశం ఉందని బస్సు యాత్ర లేదా మరో యాత్రను జగన్ ప్లాన్ చేసే అవకాశం ఉందని ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆయన కొన్ని కార్యక్రమాలు నిర్వహించ వచ్చు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: