మళ్ళీ ఆ స్థానాల్లో బలయ్యే తమ్ముళ్ళు ఎవరు?
గత ఎన్నికల్లో చంద్రబాబు వేసిన కొన్ని వ్యూహాలు ఫెయిల్ అవ్వడం వల్ల చాలామంది నేతలు బలయ్యారు. అంటే ఏదో సక్సెస్ అయిపోవచ్చని బాబు ఊహించని వ్యూహాలతో ముందుకొచ్చారు. కానీ ఆ వ్యూహాలు పూర్తిగా చిత్తు అయ్యాయి. ఉదాహరణకు చెప్పాలంటే అసెంబ్లీ స్థానాల బరిలో ఉండే అభ్యర్ధులని పార్లమెంట్ స్థానాల్లో నిలబెట్టారు. దర్శి అసెంబ్లీలో నిలబడాల్సిన శిద్ధా రాఘవరావుని ఒంగోలు పార్లమెంట్ బరిలో నిలబెట్టారు.
అసలు పార్లమెంట్ బరిలో టీడీపీ తరుపున నిలబడాల్సిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి..వైసీపీలోకి వెళ్ళి పోటీ చేయడంతో...చంద్రబాబు సడన్గా వ్యూహం మార్చి...శిద్ధాని ఒంగోలు బరిలో పెట్టారు. ఇటు కనిగిరి నుంచి కదిరి బాబూరావుని తీసుకొచ్చి దర్శిలో నిలబెట్టారు. అసలు ఈ వ్యూహం పూర్తిగా ఫెయిల్ అయ్యి...ఇద్దరు నేతలు ఓడిపోయారు. పైగా ఓడిపోయాక ఇద్దరు నేతలు టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు.
అటు నెల్లూరు విషయానికొస్తే...కావలి అసెంబ్లీలో పోటీ చేయాల్సిన బీదా మస్తాన్ రావుని నెల్లూరు పార్లమెంట్ బరిలో నిలబెట్టారు. కావలిలో కాటంరెడ్డి విష్ణు వర్ధన్ రెడ్డిని నిలబెట్టారు. ఈ వ్యూహం కూడా ఫెయిల్ అయింది. ఇద్దరు ఓడిపోయారు...ఓడిపోయాక బీదా వైసీపీలో చేరిపోయారు. ఇలా రెండు చోట్ల నేతలని బాబు బలి చేశారు. అయితే ఇప్పటికీ ఒంగోలు, నెల్లూరు పార్లమెంట్ స్థానాల బరిలో టీడీపీకి నాయకులు లేరు. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా చంద్రబాబు ప్రయోగాలు చేసేలా ఉన్నారు. ఒంగోలు, నెల్లూరుల్లో మళ్ళీ వేరే నాయకులని నిలబెట్టడం ఖాయం. మరి అప్పుడు ఏ నాయకులు బలి అవుతారో చూడాలి.