పెట్రోల్‌ను దాటేసిన టమాటా.. కిలో ఎంతంటే..?

N ANJANEYULU

దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు ఒక్కసారిగా మండిపోతున్నాయి. దీంతో సామాన్యులు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా నిత్యావసరాల ధరలు తాజాగా భారీగా పెరిగాయి. ముఖ్యంగా కూరగాయలు ఏమి కొనాలన్నా.. కేజీ 60 నుంచి 80  రూపాయల వ‌ర‌కు ధ‌ర పలుకుతోంది. ఇక టమాట ధరలైతే మాత్రం ఆకాశాన్నే అంటుతున్నాయి. పెట్రోల్ ధరలు లాగే.. టామాట ధరలు కూడా సెంచరీ దాటి దూసుకెళ్లుతూ.. ఉన్నాయి.  ఇటీవల పెట్రోల్ ధరలకు కాస్త.. బ్రేక్ పడిన సంగతి తెలిసిన‌దే.కానీ  టమాట ధరలు మాత్రం ఆల్‌టైం రికార్డును బ్రేక్ చేస్తునే ఉన్నాయి. సాధారణంగా చలికాలంలో కేజీ రూ.20 నుంచి 30 టామటాల ధరలు తెలుగు రాష్ట్రాల్లో సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఏకంగా రూ.100 దాటి పరుగులు తీస్తున్నాయి.
 ఇక హైదరాబాద్‌లో కిలో టమాటా సుమారు రూ.120 పలుకుతోంది. టమాటా పంటకు అతి పెద్ద కేంద్రంగా ఉన్న ఏపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్న‌ది. ఇక తమిళనాడు రాజధాని చెన్నైలో అయితే కిలో టమాటా ఏకంగా రూ.140 పలుకుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ తమిళనాడు, కర్ణాటకలో కిలో ధర ఎన్నడూ లేనంతగా రూ.వంద దాటేసిన‌ది.
కాగా.. నవంబర్ నెల మొదట్లో టమాట కేజీ ధర రూ.20నే ఉంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో టమాటా ధర కిలో రూ.20 నుంచి రూ.40 మధ్యనే ఉంది. అయితే కేవలం 20 రోజుల గ్యాప్‌లోనే టమాట రేటు ఆకాశాన్ని అంటిన‌ది. ముఖ్యంగా పెరిగిన ట‌మోటా ధ‌ర‌లు మ‌రొక నెల రోజుల పాటు త‌గ్గ‌వ‌ని వ్యాపారులు పేర్కొంటున్నారు. మ‌హారాష్ట్రలోని సోలాపూర్‌, క‌ర్నాట‌క‌లోని చిక్‌బ‌ల్లాపూర్‌, ఛ‌తీస్‌గ‌డ్ ల‌లో ప‌లు ప్రాంతాల నుంచి మాత్ర‌మే ట‌మోట వ‌స్తున్న‌ట్టు  వ్యాపారులు పేర్కొంటున్నారు. అయితే.. ట‌మోటా ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డంతో రైతులు కాస్త హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: