గ‌ల్లా చంద్ర‌బాబుకు అందుకే దూర‌మ‌య్యారా ?

VUYYURU SUBHASH
గుంటూరు నుంచి వ‌రుస‌గా రెండు సార్లు టీడీపీ త‌రపున ఎంపీ గా గెలిచారు ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గల్లా జ‌య‌దేవ్‌. 2014 ఎన్నిక‌ల్లో తొలిసారిగా ఎంపీ గా గెలిచిన గ‌ల్లా 2019 ఎన్నిక‌ల్లో కూడా చాలా స్వ‌ల్ప మెజార్టీ తో వ‌రుస‌గా రెండో సారి ఎంపీ గా గెలిచారు. అయితే కొద్ది రోజులుగా మాత్రం ఆయ‌న సైలెంట్ అయిపోయారు. అస‌లు ఎక్క‌డా క‌న‌ప‌డ‌డం లేదు. త‌న‌ను రెండోసారి ఎంపీ గా గెలిచిన గుంటూరు ప్ర‌జ‌ల‌కు కూడా త‌న ఫేస్ చూపించ‌డం లేదు. ఇందుకు కార‌ణం ఏంటి ? ఆయ‌న చంద్ర‌బాబు తో ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నార‌న్న‌ది ప‌రిశీ లిస్తే అధికార వైసీపీ ప్ర‌భుత్వం గ‌ల్లా వ్యాపారాల‌ను గ‌ట్టిగా టార్గెట్ చేయ‌డ‌యే అంటున్నారు.
గ‌ల్లా త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధి లోనే ఉన్న పార్టీ కార్యాల‌యంపై వైసీపీ వాళ్లు పెద్ద ఎత్తున దాడి చేసినా కూడా అటు వైపు అస‌లు తొంగి చూడ‌లేదు. మ‌రో వైపు చంద్ర‌బాబు ఏకంగా 36 గంట‌లు దీక్ష చేసినా అప్పుడు కూడా అటు వైపు రాలేదు. చివ‌ర‌కు భువ‌నేశ్వ‌రి విష‌యంలో అంత గొడ‌వ జ‌రిగినా కూడా గ‌ల్లా స్పందించ లేదు. ఇక స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను కూడా ఆయ‌న ఏ మాత్రం ప‌ట్టించు కోలేదు. ఇక ఇప్పుడు అమ‌రావ‌తి రైతులు ఏకంగా 37 రోజుల పాటు పాద‌యాత్ర చేస్తున్నా కూడా గ‌ల్లా స్పందించ లేదు.
ఇక త‌న వ్యాపారాల‌పై దాడులు జ‌రుగుతున్న నేప‌థ్యంలో గ‌ల్లా వాటికి భ‌య‌ప‌డే టీడీపీ కార్య‌క్ర‌మాల‌ను, చంద్ర‌బాబును ప‌ట్టించు కోవ‌డం లేద‌ని కొంద‌రు అంటంటే.. మ‌రి కొంద‌రు మాత్రం అసలు చంద్ర‌బాబు కూడా గల్లాను ప‌ట్టించు కోవ‌డం మానేశార‌ని అంటున్నారు. ఏదేమైనా గ‌ల్లా మాత్రం సైలెంట్ అవ్వ‌డం టీడీపీ వ‌ర్గాలకు ఏ మాత్రం మింగుడు ప‌డ‌డం లేదు. మ‌రి గల్లా ఎప్ప‌ట‌కి యాక్టివ్ అవుతారో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: