కేసీఆర్‌కు టెన్షన్ స్టార్ట్... సర్వేలపై ఆశలు పెట్టుకున్నారా..!
ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు కెసిఆర్ సర్వశక్తులు ఒడ్డారు. మంత్రి హరీష్ రావు ను ఈ ఉప ఎన్నికకు ఇన్ఛార్జిగా నియమించడంతో పాటు కోట్లాది రూపాయలు ధారపోశారు. భారత దేశంలోనే ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకాన్ని ఈ నియోజకవర్గంలోని వాసాలమర్రి లో తెరమీదకు తీసుకువచ్చారు. అయితే కేసీఆర్ లెక్క ఘోరంగా తప్పింది. కేసీఆర్ చెబితే ఓట్లు ఎప్పుడూ రాలవన్న విషయం ఆయనకు అర్థం అయింది. దీంతో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తన పాలన ఎలా ఉంది ? 2023 లో ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుంది ? ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుంది.. అన్న విషయంపై ఆయన సర్వేలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ సంస్థతో టిఆర్ఎస్ అధిష్టానం డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ సంస్థ ప్రతినిధులు ప్రగతి భవన్లో కేసీఆర్ తో సమావేశం అయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కెసిఆర్ సాధారణంగా ఇలాంటి సర్వేలపై తక్కువగా ఆధారపడతారు. ఎంత వరకు తాను తీసుకున్న నిర్ణయాలు ... తన పాలనే తనను ఎప్పుడు గెలుస్తుంది అని అనుకుంటారు. అయితే దుబ్బాక తోపాటు హుజురాబాద్ - గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉండడం తో కేసీఆర్ ఇప్పుడు తన పాలన పై తన నిర్ణయాలపై .. పునరాలోచన దిగినట్లు తెలుస్తోంది.