నేను ఉండలేను అంటున్న టీడీపీ ఎంపీ...?

Gullapally Rajesh
తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలు ఈ మధ్యకాలంలో బయటకు రాకపోవడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లో కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది అని అభిప్రాయం కొంత వరకు ఉంది. టిడిపిలో కీలకంగా ఉన్న నాయకులు కూడా ఏం మాట్లాడకపోవడం కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి చాలామంది నాయకులు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటం వంటివి తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో బాగా ఇబ్బంది పెడుతున్న అంశాలుగా చెప్పాలి. టిడిపిలో కప్పుడు చక్రం తిప్పిన నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనే దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు వద్ద కూడా ఇటువంటి సమాచారం లేదు.
ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ అసలు ఈ మధ్యకాలంలో పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావడానికి కూడా పెద్దగా ఇష్టపడలేదు అని ఇతర ఎంపీలతో కలిసి పని చేయడానికి ఆయన ముందుకు రావడం లేదని అంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు గల్లా జయదేవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనకేసుకు రావడానికి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేసి నేషనల్ మీడియాలో కూడా బాగా హైలెట్ అయ్యారు. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడు బయటకు రాక పోయినా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నష్టపోయే అవకాశం ఉంటుంది

గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా ఉన్న సరే అమరావతి రైతులు పాదయాత్రకు సంఘీభావం తెలపడం గాని అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొనడం గానీ చేయలేకపోతున్నారు. పార్టీలో ఉన్న చాలామంది నాయకులు ఆయన వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నా సరే ఆ వాళ్లకు కూడా ఆయన అందుబాటులో లేరనే ప్రచారం జరుగుతోంది. పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు ఆయన వద్దకు వెళ్ళిన సమయంలో పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నాను అనే అంశాన్ని కూడా ప్రస్తావించారని వచ్చే ఎన్నికల్లో తనకు రాజకీయాల మీద ఆసక్తి లేదని చెప్పినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: