కమ్మ వర్సెస్ కమ్మ: తేలిపోతున్న వైసీపీ నేతలు?
అలా వైసీపీ ఫెయిల్ అయిన నియోజకవర్గాలు పర్చూరు, అద్దంకి నియోజకవర్గాలు. గత ఎన్నికల్లో పర్చూరులో టీడీపీ తరుపున ఏలూరి సాంబశివరావు పోటీ చేస్తే...వైసీపీ తరుపున దగ్గుబాటి వెంకటేశ్వరావు పోటీ చేశారు. కానీ విజయం ఏలూరిని వరించింది. అటు అద్దంకిలో టీడీపీ నుంచి గొట్టిపాటి రవికుమార్ బరిలో దిగగా, వైసీపీ నుంచి బాచిన చెంచుగరటయ్య పోటీ చేశారు...కానీ విజయం గొట్టిపాటిని వరించింది.
జగన్ గాలిలో సైతం టీడీపీ నుంచి గెలిచిన ఏలూరి, గొట్టిపాటిలు దూసుకెళుతున్నారు. ఇప్పుడు కూడా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు స్ట్రాంగ్‌గానే ఉన్నారు. అయితే ఇప్పుడు వారి నియోజకవర్గాల్లో వైసీపీ ఇంచార్జ్‌లు కమ్మ నేతలే. పర్చూరులో వైసీపీ ఇంచార్్యగా రావి రామనాథంబాబు ఉండగా, అద్దంకిలో బాచిన కృష్ణచైత్య ఇంచార్జ్‌గా ఉన్నారు. ఈ ఇద్దరు ఏ మాత్రం టీడీపీ ఎమ్మెల్యేలకు పోటీ ఇవ్వలేకపోతున్నారు.
పర్చూరులో రావి ఏ మాత్రం పట్టు సాధించినట్లే కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నా సరే...ఆ అధికార బలాన్ని ఉపయోగించుకుని బలపడలేని స్థితిలో రావి ఉన్నారు. అటు అద్దంకిలో బాచిన పరిస్తితి కూడా అదే. గొట్టిపాటికి ఏ మాత్రం పోటీ ఇచ్చే స్థాయిలో బాచిన ఉన్నట్లు కనిపించడం లేదు. ఏదో స్థానిక ఎన్నికల్లో అధికార బలంతో గెలిచారు గానీ, క్షేత్ర స్థాయిలో గొట్టిపాటిని మించి బలం సాధించలేకపోయారు. మొత్తానికైతే ఈ ఇద్దరు కమ్మ నేతలు...టీడీపీ కమ్మ ఎమ్మెల్యేల ముందు తేలిపోతున్నారని చెప్పొచ్చు.