పయ్యావుల వర్సెస్ విశ్వేశ్వరరెడ్డి: వెరైటీ ఉరవకొండ!
1999 ఎన్నికల్లో ఉరవకొండ నుంచి టీడీపీ తరుపున పయ్యావుల కేశవ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ అప్పుడు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. . అంతకముందు 1994లో గెలిచారు గానీ అప్పుడు టీడీపీ కూడా అధికారంలోకి వచ్చింది. కానీ 1999లోనే సీన్ రివర్స్ అయింది. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. మళ్ళీ 2004లో సీన్ రివర్స్ అయింది...2004లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది...కానీ ఉరవకొండలో టీడీపీ తరుపున పయ్యావుల విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కూడా సేమ్ సీన్. పయ్యావుల కేశవ్ గెలవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగాయి.
2014లో మళ్ళీ రివర్స్..రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే ఉరవకొండలో వైసీపీ తరుపున విశ్వేశ్వరరెడ్డి విజయం సాధించారు. పయ్యావుల ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో కూడా అంతే...రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే...ఉరవకొండలో టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్ గెలిచారు. మరి 2024 ఎన్నికల్లో ఉరవకొండ లో ఎలాంటి ఫలితం వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతానికి పయ్యావుల కేశవ్ రాజకీయంగా బలంగానే ఉన్నారు....కాకపోతే వైసీపీ అధికారంలో ఉండటంతో ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి పట్టు దక్కించుకునే దిశగా వెళుతున్నారు. ప్రభుత్వ పథకాలు ఆయనకు బాగా ప్లస్ అవుతున్నాయి. అలా అని పయ్యావుల కేశవ్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆయనకు నియోజకవర్గంపై పట్టు ఉంది. ఇప్పుడైతే ఇద్దరు నేతల మధ్య పోటాపోటి వాతావరణం ఉంది. మరి వచ్చే ఎన్నికల్లో ఉరవకొండ లో ఎలాంటి వెరైటీ ఫలితం వస్తుందో చూడాలి.