ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే?

praveen
ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో  ఎంతోమందికి పెట్రోల్ డీజిల్ ధరల భారం గా మారిపోతున్నాయ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో పెట్రోల్ డీజిల్ తో నడిచే కార్లు కాకుండా ఎలక్ట్రికల్ కార్లు బైకులు కు భారీగా డిమాండ్ పెరిగిపోతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కూడా ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ కార్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ప్రస్తుతం వినూత్నమైన టెక్నాలజీ తో తయారుచేయబడిన కార్లు మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే ఇలా ఎలక్ట్రికల్ కార్లు తయారు చేయడంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ తెస్లా.

 ఇక ప్రపంచవ్యాప్తంగా ఇక టెస్లా ఎలక్ట్రికల్ కారులకు ఎంతగానో క్రేజ్ ఉంటుంది అని చెప్పాలి. ఇలా ఎలక్ట్రికల్ కార్ లకు కేరాఫ్ అడ్రస్గా మారిన టెస్లా కంపెనీకి షాక్ ఇస్తూ ఇటీవలే మార్కెట్లోకి అడుగుపెట్టింది ఒక కొత్త కంపెనీ. తక్కువ సమయంలోనే ప్రపంచ మార్కెట్ లో  ఎంతగానో పాపులారిటీ సంపాదించింది. ఇక ఎలక్ట్రికల్ కార్ల మార్కెట్లో టెక్నాలజీ తో ఒక సరికొత్త అధ్యాయానికి కొత్త కంపెనీ శ్రీకారం చుట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా ఎలక్ట్రిక్ కార్ల లో కొత్త విప్లవం సృష్టించిన సంస్థ పేరు లూపిడ్ మోటార్స్.

 సిలికాన్ వాలీ కి చెందిన ఈ కంపెనీని స్థాపించిన కొన్ని రోజులలోనే మార్కెట్లో ఇక ఈ కంపెనీ షేరు ధర ఎవరూ ఊహించని విధంగా పెరిగిపోయింది. ఇక ఈ కంపెనీ యొక్క విలువ మార్కెట్లో ప్రస్తుతం 85 వేల మిలియన్ డాలర్లు దాటేసింది. ఇక ఈ కంపెనీ తయారు చేసినటువంటి తొలి మోడల్ లూసిఫ్ ఏయిర్  డ్రీమ్ ఎడిషన్ మోటార్ ట్రెండ్ అనే పత్రిక కార్ ఆఫ్ ది ఇయర్ గా గుర్తించడంతో ఈ కంపెనీ షేర్ వాల్యూ పెరిగిపోయింది. అయితే ఇప్పటి వరకు ఎలక్ట్రికల్ కార్లను ఒక్కసారి ఛార్జ్ చేస్తే కేవలం మూడు వందల కిలోమీటర్లు మాత్రమే వెళ్లేందుకు అవకాశం ఉంది. కానీ ఇక ఇప్పుడు ఈ కంపెనీ తయారు చేసినకార్లలో మాత్రం ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా ఎనిమిది వందల కిలో మీటర్లకు పైగా ప్రయాణించవచ్చు. ఇలా టెక్నాలజీ లోనే సంచలనం సృష్టించి ఏకంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టెల్సా సంస్థకి వణుకు పుట్టించింది  లూపిడ్ మోటార్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: