బీజేపీ ఎఫెక్ట్ : తెలంగాణ లో బిగ్ బాస్ బ్యాన్ ?
ఆ కార్యక్రమం కారణంగా వచ్చే విజ్ఞానం ఏంటి?
ఇవే ప్రశ్నలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి
తెలంగాణకు, ఆంధ్రాకు గొడవలేం లేవు. కానీ బిగ్ బాస్ కారణంగా జరిగే అవకాశం ఉందని బీజేపీ మాట. ఆ మాట విని అంతా ఆశ్చర్యపోవచ్చు. కానీ కంటెస్టెంట్లను ఇంటికి వెళ్లగొట్టే పనిలో తెలంగాణ విషయమై కాస్త ఎక్కువ చొరవ చూపిస్తున్నారని, ఇది తగదని బీజేపీ భావిస్తోంది. ఏదేమయినప్పటికీ కొత్త వివాదంలో బీజేపీ ఎంటరైంది. గతంలో కమ్యూనిస్టులు ఎంటరైనా పెద్ద ఫలితం లేకపోయింది కానీ ఇప్పుడు బిగ్ బాస్ ను ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బీజేపీ హెచ్చరించడం బాగుంది. దీనిపై సినిమా పెద్దలకు ఎప్పుడూ దగ్గరగా ఉంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఏమంటారో మరి!
ఇంకా చెప్పాలంటే...
యాంకర్ రవికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఏమయినా సంబంధం ఉందా.. కానీ సీన్ లోకి వివాదాస్పద ఎమ్మెల్యే వచ్చారు. దీంతో విషయం వేడెక్కిపోయింది. వార్త హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ షో పై ఉన్న ఒపీనియన్ ఏంటో చెప్పి భలే తిట్టిపోశా రు ఆ షోను. అసలు ఆ షో పై ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క పాజిటివ్ ఒపీనియన్ లేకపోయినా కూడా ఇరు తెలుగు రాష్ట్రాలలో హాయిగా నడుస్తోంది. కారణం దానిని నాగార్జున హోస్ట్ చేయడం. గతంలో కూడా ఇలాంటివే వచ్చాయి కానీ ఆగాయి. ఈ సారి మాత్రం షోను ఆపే వరకూ తాము నిద్రపోమని అంటున్నాయి కాషాయ వర్గాలు. బీజేపీ కి దగ్గరగా ఉండే నాగార్జున ఇప్పుడేం అంటాడో మరి! మోడీ భజనలో మునిగితేలే టాలీవుడ్ పెద్దలకు తాజా పరిణామం మాత్రం పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది.
కామ్రెడ్ల మాట వినిపించుకోరు కానీ...
వాస్తవానికి.. బిగ్ బాస్ షో పై ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. అసలు ఆ షోను బ్యాన్ చేయాలని అడుగుతున్నారు కొందరు. ఎందుకంటే ఆ షో అంతా కలిసి చూడదగ్గ షో కాదని, పిల్లలపై విష ప్రభావం చూపుతోందని గతంలో సీపీఐ నారాయణ మండిపడ్డారు. తాజాగా సీన్ లోకి ఎమ్మెల్యే రాజా సింగ్ వచ్చారు. ఆయన కూడా షో ను బ్యాన్ చేయాల్సిందేనని అంటున్నారు. ఆదివారం నాడు షో నుంచి యాంకర్ రవి ఎలిమినేట్ కావడంపై చాలా మంది ఆయన అభిమానులు హర్ట్ అయ్యారు. షో జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియో కు వచ్చి నిరసన తెలియజేశారు. దీనికి ఎమ్మెల్యే రాజా సింగ్ మద్దతు ఇచ్చారు.