కొడాలి, వంశీలకు కొత్త ప్రత్యర్ధులు?
చంద్రబాబు రాజకీయంగా జగన్‌పై ఏదైనా విమర్శలు చేస్తే చాలు...వెంటనే వీరు స్పందిస్తూ...ఆ విమర్శలకు కౌంటర్లు ఓ రేంజ్‌లో ఇస్తున్నారు. అది కూడా బూతులతో ఫైర్ అయిపోతున్నారు. ఇలా టీడీపీలో రాజకీయంగా ఎదిగి...ఇప్పుడు అదే టీడీపీని దెబ్బకొట్టడానికి కొడాలి, వంశీలు గట్టిగానే పనిచేస్తున్నారు. ఇక ఇటీవల చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అంశంలో ఎలాంటి రాజకీయం నడిచిందో అందరికీ తెలిసిందే.
ఇలా చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్న కొడాలి, వంశీలకు చెక్ పెట్టడానికి టీడీపీ కూడా తెగ ప్రయత్నాలు చేస్తుంది. అటు గుడివాడ నియోజకవర్గంలో గత రెండు పర్యాయాలుగా నానికి టీడీపీ చెక్ పెట్టలేకపోతుంది. రెండుసార్లు అభ్యర్ధులని మార్చిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు రావి వెంకటేశ్వరరావు ఇంచార్జ్‌గా ఉన్నారు గానీ, ఆయన దూకుడుగా లేరు. ఒకవేళ రావి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తే కొడాలిని ఓడించడం కష్టం...అందుకే ఆయనపై పోటీ చేసే ప్రత్యర్ధిని మళ్ళీ మార్చాలని టీడీపీ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సారి నానిపై వంగవీటి రాధాని బరిలోకి దింపుతారని ప్రచారం జరుగుతుంది.
ఇటు గన్నవరంలో వంశీపై కూడా ప్రత్యర్ధిని మార్చాలని చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ టీడీపీ తరుపున బచ్చుల అర్జునుడు పనిచేస్తున్నారు. ఆయన కూడా దూకుడుగా లేరు. ఒకవేళ బచ్చుల పోటీ చేస్తే టీడీపీ ఓటమి ఖాయమే. అందుకే వంశీపై గద్దె రామ్మోహన్ సతీమణి గద్దె అనురాధాని పోటీకి దించితే ఫలితం ఉంటుందని టీడీపీ యోచిస్తుంది. మరి కొడాలి, వంశీలపై కొత్త ప్రత్యర్ధులని దించుతారో లేదో చూడాలి.