కేసీఆర్ ఆ భయంతోనే ఆ కులానికి పెద్దపీఠ వేస్తున్నారా..?
తెలంగాణలో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా వార్ మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో కూడా వీరిద్దరి మధ్య పోటీ ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రేవంత్ రెడ్డికి పిసిసి పదవి వచ్చాక తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఆ సామాజిక వర్గం యువత కూడా రేవంత్ ను ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో సీఎం చేసుకోవాలని పట్టుదలతో ఉంది.
మారుతున్న పరిస్థితులను గమనించి కేసీఆర్ సైతం తమ పార్టీ లో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ రెడ్ల కు ఊహించని విధంగా పదవులు కట్టబెట్టారు. 2019 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ కెసిఆర్ రెడ్డి సామాజిక వర్గం వారికే ఎక్కువ ఎంపీ సీట్లు ఇచ్చారు. ఇక కేసీఆర్ క్యాబినెట్ లో ఎక్కువ మంది రెడ్డి మంత్రులే ఉన్నారు.
ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ పదవుల్లోనూ ఆ వర్గానికి పెద్దపీట వేశారు. ఎలాగైనా రెడ్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపకుండా కేసీఆర్ రాజకీయం చేస్తున్నారు. అందుకే పై నుంచి కింద స్థాయి వరకు వాళ్లకే ఎక్కువ పదవులు ఇస్తున్నారు.