'జై భీమ్' సినిమాపై ఎమ్మెల్యే సీతక్క ఏమందో తెలుసా?
దళితులు అణగారిన వర్గాల వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎలాంటి వివక్షకు గురవుతున్నారు అన్న విషయాన్ని సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ముఖ్యంగా అగ్రకులాల వారు గిరిజనులను ఎంత దారుణంగా శిక్షించేవారు అనే విషయం కూడా ఈ సినిమాలో చూపించారు. సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా కంట నీరు తెప్పిస్తోంది అని చెప్పాలి. ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయింది. సినిమాపై ప్రస్తుతం అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇటీవలే ఆదివాసీల నుంచి వచ్చి ఏకంగా ఒక నక్సలైట్ గా మారి ఇక ఇప్పుడు ఏకంగా ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు సీతక్క.
ఇటీవలే జై భీమ్ సినిమా చూసిన సీతక్క ఏకంగా చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ సినిమా చూస్తున్నంతసేపు నా జీవితం నాకు గుర్తుకు వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. ఆదివాసీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక లాయర్ గా జై భీమ్ సినిమాలో చూసిన ప్రతి ఒక్క పాత్ర కూడా తన జీవితంలో తాను ప్రత్యక్షంగా చూశాను అంటూ సీతక్క తెలిపారు. సినిమాలో చూపించిన ప్రతి ఒక్కటి నిజమే అంటూ తెలిపారు. అయితే ఇలాంటి అద్భుతమైన సినిమాను తీసిన చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే సీతక్క. సీతక్క పోస్ట్ పై స్పందించిన హీరో సూర్య మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.