కేతిరెడ్డి కోటలో పవన్ కీ రోల్?

M N Amaleswara rao
వచ్చే ఎన్నికల్లో జనసేన పలు నియోజకవర్గాల్లో కీలకంగా మారనుందని అర్ధమవుతుంది. ఆ పార్టీ గెలవకపోయినా..గెలుపోటములని మాత్రం ప్రభావితం చేయగలదని తెలుస్తోంది. అయితే జనసేన కేవలం గోదావరి జిల్లాలు, కృష్ణా, విశాఖల్లోనే ఎక్కువ ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. అసలు ఆ పార్టీకి రాయలసీమ జిల్లాలో అంత సీన్ లేదు. గత ఎన్నికల్లో సీమలోని జిల్లాల్లో జనసేన ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. కనీసం డిపాజిట్లు కూడా రాలేదు.

 
కాకపోతే కొన్ని నియోజకవర్గాల్లో 10 వేలు లోపు ఓట్లు తెచ్చుకుంది. ఆ ఓట్లు గత ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయాయి గానీ, వచ్చే ఎన్నికల్లో కాస్త ఉపయోగపడేలా ఉన్నాయి. అది కూడా టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకి ఉపయోగపడతాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో అంటే జగన్ గాలి ఫుల్ గా ఉంది. ఈ సారి ఎన్నికల్లో మాత్రం అలాంటి పరిస్తితి ఉండకపోవచ్చు. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై కాస్త వ్యతిరేకత ఉంటుంది...అలాగే ప్రతిపక్ష టీడీపీపై ఓడిన సానుభూతి.
కాబట్టి ఈ రాజకీయ పరిణామాలని బట్టి చూస్తే నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-వైసీపీల మధ్య హోరాహోరీ పోరు మాత్రం జరిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు జనసేన వల్ల కాస్త టీడీపీకి ప్లస్ అవుతుంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో జనసేనకు కాస్త ఓట్లు బాగానే పడ్డాయి. ధర్మవరం నియోజకవర్గంలో 6 వేల ఓట్లు వరకు వచ్చాయి.
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి..టీడీపీపై 16 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే ఆ ఎన్నికల్లో జగన్ వేవ్ ఉంది...కానీ నెక్స్ట్ ఎన్నికల్లో పరిస్తితి మారే ఛాన్స్ ఉంది. పైగా టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనసేనకు పడిన 6 వేల ఓట్లు కీలకం కావొచ్చు. ఇంకా ఇప్పుడు అక్కడ జనసేనకు మద్ధతు కూడా పెరగొచ్చు. మొత్తానికైతే కేతిరెడ్డి అడ్డాలో పవన్ కీలకం అయ్యే ఛాన్స్ ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: