బిజెపి సీక్రెట్ మీటింగ్.. టార్గెట్ కెసిఆరేనా..!

MOHAN BABU
తెలంగాణ బీజేపీ లో దూకుడు కొనసాగుతోంది. ఇటీవల హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసిన తర్వాత అదే దూకుడు కొనసాగించాలని పార్టీ అధిష్టానం నుంచి రాష్ట్ర నాయకులకు వర్తమానం వచ్చింది. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన బిజెపి జాతీయ కార్య వర్గ సమావేశంలో సాక్షాత్తు నరేంద్రమోడీ కూడా ఉద్ఘాటించారు. హుజురాబాద్ ఎఫెక్ట్ ను ఆసరాగా చేసుకుని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారం అందుకునేలా అడుగులు వేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. దీంతో తెలంగాణ బీజేపీ లో ఉత్సాహం మరింత పెరిగింది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ బిజెపి నాయకుడు హైదరాబాద్ శివారులో అత్యంత గోప్యంగా భేటీ అయ్యారు. డిన్నర్ పార్టీ చేసుకున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఏం చర్చించారన్న విషయం ఆసక్తిగా మారింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, హైదరాబాద్ బాద్ షా ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, వివేక్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం పై సర్వత్ర  ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో ప్రధానంగా అధికార పార్టీని టార్గెట్ చేయడం పైన అధికారంలోకి వచ్చేందుకు ఉన్న మార్గాలను మరింత పుంజుకునేలా చేయడం పైన నాయకులు దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం సీఎం కేసీఆర్ బీజేపీని భారీ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రం ఇలా ఉండడానికి  బీజేపీనే కారణమని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అదే సమయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తరఫున  ఉద్యమాలు చేయిస్తున్నారు.

 ఈ పరిణామాలను సహజంగానే రాష్ట్ర స్థాయిలో అడ్డుకోవాలని బిజెపి నేతలు భావిస్తున్నారు. దీంతో తెలంగాణ బిజెపి ని మరింత ముమ్మరంగా కెసిఆర్ పై విజృంభించేలా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశం అంతా కూడా కెసిఆర్ చుట్టూ తానే తిరగడం గమనార్హం. ఇక అదే సమయంలో పార్టీలో అంతర్గత విభేదాలు  ఉన్నాయి. కిషన్ రెడ్డి,రాజాసింగ్, బండి సంజయ్, రఘునందన్, జితేందర్ రెడ్డి, డీకే అరుణ లాంటి నేతల మధ్య  విభేదాలు ఉండగా నేతలందర్నీ ఒక్క తాటి పైకి తేవడానికి అధిష్టానం ప్రయత్నిస్తోంది. అదే విధంగా ఆపరేషన్ ఆకర్ష్ 2 గురించి కూడా చర్చించే వీలుంది. వీటితో పాటు మిలియన్ మార్చ్ విజయవంతం చేయడం, పాదయాత్ర రెండో విడత లో తీసుకోవాల్సిన చర్యల పై సూచనలు తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. అంతర్గత వ్యవహారాలు చక్కదిద్దుకునేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నం ఎంత మేరకు సఫలమవుతుందో చూడాలి. మరీ ముఖ్యంగా కేసీఆర్ పై ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతున్నారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: