కొత్త ఎమ్మెల్సీల్లో జ‌గ‌న్ క్యాస్ట్ లెక్క‌లు మామూలుగా లేవుగా.. ఏ కులం వారికి ఎన్ని ప‌ద‌వులు అంటే..!

VUYYURU SUBHASH
ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌ల‌కు ముందు నుంచే కులాల లెక్క‌లు ప‌క్కాగా ఫాలో అవుతూ వ‌చ్చారు. గ‌త టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో కొన్ని కులాల కే ప‌ద‌వులు వ‌చ్చాయ‌ని బ‌లంగా ఆరోపించిన జ‌గ‌న్ తాను అధికారంలోకి వ‌చ్చాక అలా చేయ‌కూడ‌ద‌ని భావించి అన్ని కులాల‌కు ప‌ద‌వులు కేటాయిస్తూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ట్ట స‌భ‌ల్లో ప్రాథినిత్యం లేని కులాల‌కు కూడా ఎమ్మెల్సీ ప‌ద‌వులు ఇస్తున్నారు.

తాజాగా జ‌గ‌న్ ఎమ్మెల్సీ సీట్ల భ‌ర్తీలో అన్ని  కులాల‌కు స‌మాన‌మై న ప్రాథినిత్యం ఉండేలా చూశారు. తాజాగా ఎమ్మెల్యేల కోటాలో మూడు ఎమ్మెల్సీలు భ‌ర్తీ చేసిన జ‌గ‌న్‌, స్థానిక సంస్థ‌ల కోటాలో మ‌రో 11 ఎమ్మెల్సీల‌ను భ‌ర్తీ చేశారు. తాజాగా భ‌ర్తీ చేసిన 14 ఎమ్మెల్సీ ప‌ద‌వుల్లో మ‌రోసారి 50 శాతం బీసీ, ఎస్సీ, మైనార్టీ ల‌కు కేటాయించి తాను అన్ని కులాల‌కు స‌మాన ప్రాధాన్య‌త ఇస్తాన‌న్న విష‌యాన్ని మ‌రో సారి ఫ్రూవ్ చేసుకున్నారు.

1- మూరుగుడు హన్మంతరావు (గుంటూరు) - బీసీ ప‌ద్మ‌శాలీ
2- ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (గుంటూరు) - ఓసీ - కాపు
3- ఇందుకూరు రాఘురాజు ( విజయనగరం) - ఓసీ - క్ష‌త్రియ‌
4- వరుదు కల్యాణి (విశాఖ) - బీసీ - కొప్పుల వెల‌మ‌
5- వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ (విశాఖ) - బీసీ - యాద‌వ‌
6- తూమాటి మాధవరావు (ప్రకాశం) - ఓసీ - క‌మ్మ‌
7- వై. శివరామిరెడ్డి (అనంతపురం) - ఓసీ - రెడ్డి
8- అనంత ఉదయ్ భాస్కర్ (తూర్పుగోదావరి) - ఓసీ - కాపు
9- మొండితోక అరుణ్ కుమార్ (కృష్ణా) - ఎస్సీ
10- తలశిల రఘురాం (కృష్ణా) - ఓసీ - క‌మ్మ‌
11- భరత్ (చిత్తూరు) - బీసీ  
12- గోవింద్ రెడ్డి (క‌డ‌ప‌) - ఓసీ - రెడ్డి
13- ఇషాక్ భాషా ( క‌ర్నూలు ) - మైనార్టీ
14- పాల‌వ‌ల‌స విక్రాంత్ (శ్రీకాకుళం) - బీసీ  - తూర్పు కాపు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: