తాడేపల్లి : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానం టు దేవస్థానం అని ఒక ముసుగు వేసుకుని పాదయాత్ర చేస్తున్నారని అగ్రహించారు సుధాకర్ బాబు. 157 మంది మాత్రమే పాల్గొంటామని జాబితా ఇచ్చి కోర్టు నుంచి అనుమతి పొందారని నిప్పులు చెరిగారు సుధాకర్ బాబు. ఇప్పుడేమో చంద్రబాబు సంఘీభావం పేరుతో రాష్ట్రంలో అలజడికి కుట్రలు పన్నుతున్నాడని ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు సుధాకర్ బాబు.
రాజధాని అమరావతి కి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగిందని స్పష్టం చేశారు సుధాకర్ బాబు. రాజధాని రైతులకు ప్యాకేజీ అందింది... ఏడాదికి ఒకసారి కౌలు డబ్బులు, ఇతర అలవెన్సులు అందుతున్నాయని వెల్లడించారు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. అమరావతి లోనే శాసన రాజధాని ఉంటుందని తేల్చి చెప్పారు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదు... మా తుళ్ళూరు లోనే రాజధాని ఉండాలనే డిమాండ్ విడ్డూరంగా ఉందని ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. పాదయాత్ర కు టీడీపీ నేతలు బయటి ప్రాంతాల నుంచి జనాలను తోలుకుని వస్తున్నారని అగ్రహించారు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు.
చంద్రబాబు ఉన్మాద రాజకీయ నాయకుడు ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. అమరావతి రైతులు కళ్ళు తెరవాలన్నారు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. ఇది ఇలా ఉండగా అటు వైసీపీ సర్కార్ మండిపడ్డారు చంద్రబాబు. వైసీపీ బలవంతంగా ఏకగ్రీవాలు చేస్తోందని అగ్రహించారు చంద్రబాబు. మంత్రి పెద్దిరెడ్డి పుడింగా అన్నీ ఏకగ్రీవాలు కావడానికి..? ఫోర్జరీ సంతకాలతో ఏకగ్రీవాలు చేసేసుకుంటున్నారని మండిపడ్డారు చంద్రబాబు. టీడీపీకి చెందిన అభ్యర్ధుల సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఎఫ్ఎస్ఎల్ కూడా నిర్దారించిందని ఫైర్ అయ్యారు నారా చంద్రబాబు.