జగన్ సర్కార్ పై ఏపీ ఉద్యోగుల దిక్కార స్వరం ?

Veldandi Saikiran
అమరావతి : ఉద్యోగుల జీతాలు ఒకటో తేదీన చెల్లించాలని ఒక చట్టం చేయాలని.. ఈ నెల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తొలి బిల్లుగా ఒకటో తేదీకే జీతాల బిల్లును ప్రభుత్వం ప్రతిపాదించాలని డిమాండ్ చేశారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ. ఒకటో తేదీనే ఇవ్వకున్నా.. ఎప్పుడో ఒకప్పుడు ఉద్యోగులకు జీతాలిస్తున్నామన్న మంత్రి బుగ్గన వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదని పేర్కొన్నారు సూర్యనారాయణ.
జీతాల నుంచి ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తోంది...ఉద్యోగులు దాచుకున్న సొమ్ము ఏడాదికి రూ. 8 నుంచి రూ. 10 కోట్ల మేర ఉంటుందని వెల్లడించారు సూర్యనారాయణ.  

ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ప్రభుత్వం ఆదాయంగా మార్చుకుని ఇతర అవసరాలకు వాడేస్తోంది.. ప్రత్యేక అకౌంట్‌ పెట్టి ఉద్యోగులకు జీపీఎఫ్‌ డబ్బులు పెండింగ్‌లో పెట్టకుండా ఇచ్చేయాలి అని డిమాండ్ చేశారు సూర్యనారాయణ.
జీపీఎప్‌ ఖాతాలకు జమ చేసిన డీఏ ఏరియర్స్‌ సొమ్మును ఉద్యోగులకు చెప్పకుండానే వారి వ్యక్తిగత ఖాతాల నుంచి వెనక్కు తీసేసుకున్నారు... ఉద్యోగుల ప్రమేయం లేకుండా.. వారి వ్యక్తిగత ఖాతాల నుంచి జమ అయిన సొమ్మును ఎలా వెనక్కు తీసుకుంటారు..? అని నిలదీశారు సూర్యనారాయణ.  

జీపీఎఫ్‌ ఖాతాల్లో నుంచి డబ్బును వెనక్కు తీసుకున్న ఘటనపై విచారణ జరిపించాలి.. సీఎఫ్‌ఎంఎస్‌, ఆర్థిక శాఖ అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి అని డిమాండ్ చేశారు సూర్యనారాయణ.  జీపీఎఫ్‌ ఖాతాల్లోని మా డబ్బుకు భద్రత ఉందా అనే అనుమానం కలుగుతోంది... ఉద్యోగుల సమస్యలు పై ప్రభుత్వం స్పందన సరిగా లేదని నిప్పులు చెరిగారు సూర్యనారాయణ.  ఆర్ధిక భారం లేని అంశాలను కూడా ప్రభుత్వం పరిష్కరించడం లేదు... సీపీఎస్ రద్దు, డీఏల చెల్లింపు, పీఆర్సీ అమలు చేస్తామన్న హామీలు పట్టించు కోవడం లేద ని అగ్రహిం చారు సూ ర్య నా రా య ణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: