వామ్మో.. చనిపోయిన మహిళకు రెండో డోస్ వ్యాక్సిన్.. చివరికి?
ఆరోగ్య కార్యకర్తలు అందరూ ఇలా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో నిమగ్నమై ఉండగా.. కొంతమంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. అయితే ఇప్పటికే ఒకేసారి ఒకే మహిళకు ఏకంగా రెండు డోసులు వ్యాక్సిన్ నిమిషాల వ్యవధిలో ఇవ్వడం.. లేదా ఒకే మహిళకు వేర్వేరు రకాల టీకాలు అందించడం లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ ఇక మరో ఇలాంటి నిర్లక్ష్యపు ఘటన బయటపడింది. సాధారణంగా ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత.. నిర్ణీత సమయంతర్వాత రెండవ డోసు వ్యాక్సిన్ వేయాలి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఆరోగ్య కార్యకర్తలు నిర్ణీత సమయం తర్వాత రెండవ డోసు వ్యాక్సిన్ వేశారు.
టీకా వేశారు కదా ఇక్కడ నిర్లక్ష్యం ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారు కదా. అయితే ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్ వేసింది బ్రతికున్న మహిళకు కాదు చనిపోయిన మహిళకు. చనిపోయిన మహిళ ఇక్కడ రెండవ డోసు వ్యాక్సిన్ తీసుకుంది. హైదరాబాద్లోని దమ్మాయిగూడ కు చెందిన కౌశల్య అనే 81 ఏళ్ల వృద్ధురాలు మే 4వ తేదీన వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకుని రెండు నెలల అనంతరం ఆమె అనారోగ్యంతో మరణించింది. ఈ విషయం తెలియక పోవడంతో రెండో డోస్ ఆ సమయం వచ్చింది అంటూ ఆరోగ్య సిబ్బంది కౌశల్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా ఆమె మరణించింది అంటూ కుటుంబ సభ్యులు తెలిపారు. కాని కొన్ని రోజుల్లోనే కౌసల్య రెండో తీసుకున్నట్లుగా కుటుంబ సభ్యులకు సందేశం వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఘటన ఆరోగ్య సిబ్బందినిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది అని అంటున్నారుకొంత మంది జనాలు.